నారద వర్తమాన సమాచారం
శ్రీకాళహస్తిలో హల్చల్ చేసిన అఘోరీ ….ఎట్టకేలకు శివుణ్ణి దర్శించుకున్న లేడీ అఘోరీ
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లేడీ అఘోరీ అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ.. శైవ క్షేత్రం శ్రీ కాళహస్తిలోకి అడుగు పెట్టింది.
చాలా సమయం శ్రీకాళహస్తి ఆలయం వద్ద హల్చల్ చేసింది.
ఒకవైపు అఘోరీ ఆశీస్సుల కోసం భక్తులు, స్థానికులు ఎగబడితే.. లేడీ అఘోరీ మాత్రం వస్త్రాలు లేకుండా ఆలయం లోనికి వెళ్లే ప్రయత్నం చేసింది.
స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ప్రయత్నించింది. అయితే దేవస్థానం సిబ్బంది మాత్రం లేడీ అఘోరీనీ అడ్డుకుంది.
దర్శనానికి వెళ్లేందుకు అఘోరి ప్రయత్నించటంతో ఆలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఆవేశంతో ఊగిపోతూ హడావుడి చేసిన లేడీ అఘోరీ వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ ను తీసి తనపై, కారు పై పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేసింది.
ఆలయ రెండో గోపురం వద్ద అఘోరీ ని అడ్డుకుని బిందెలతో నీళ్ళు పోసిన పోలీసులు.. అఘోరీ శరీరంపై మహిళా పోలీసుల చేత బట్టలు కల్పించి పరిస్థితిని అదుపు చేశారు.
తిరిగి దర్శనానికి వెళ్తానంటూ హడావుడి చేసింది. నగ్నంగా కాకుండా బట్టలు వేసుకొని వస్తే తప్ప దర్శనానికి అనుమతించమని దేవస్థానం అధికారులు అఘోరీ కి తేల్చి చెప్పారు.
దీంతో ఎట్టకేలకు ఎర్రని వస్త్రంతో శరీరాన్ని కప్పుకొని, కపాలమాలలు తీసి వేసి సామాన్య భక్తురాలిగా పోలీసుల బందోబస్తు తో ఆలయంలోకి వెళ్లిన అఘోరి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంది. పలువురు సీఐలు, ఎస్సైలతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అఘోరిని ఆలయంలోకి తీసుకెళ్ళి ముక్కంటి దర్శనం చేయించారు. అనంతరం అఘోరీ పంపిన పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.