నారద వర్తమాన సమాచారం
అసెంబ్లీ:-
మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం
శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు
జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు
గతంలో చంద్రబాబు సభకు రాలేదంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
అమరావతిః గత వైసీపీ పాలనలో చంద్రబాబునాయుడు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాతే బాయ్ కాట్ చేశారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనమండలిలో వైసీపీ దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబునాయుడు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హౌస్ కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. గౌరవ సభ అయిన తర్వాత వస్తా అన్నారు. నా తల్లిని అవమానించారు. ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు ఆ రోజు. మీకు గుర్తులేవా ఇవన్నీ. అవమానించలేదని మీరు ఏవిధంగా మాట్లాడతారు. మీరున్నారా హౌస్ లో? షర్మిల ని అవమానిస్తారు, విజయలక్ష్మి ని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారు. ఇవన్నీ గుర్తులేవా మీకు. నేను కూడా మాట్లాడవచ్చు. కానీ ఏనాడూ మేం మాట్లాడలేదు. జగన్ రెడ్డి కుటుంబం గురించి మేం ఏనాడూ మాట్లాడలేదు. మా సభ్యులు ఏనాడూ మాట్లాడలేదు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబునాయుడు గారు ప్రతి రోజూ హౌస్ కు వచ్చారు. ప్రతి రోజూ హౌస్ లో నిలబడ్డారు. సింగిల్ గా నిలబడ్డారు సింహంలా. గుర్తుపెట్టుకోండి, పోరాడారు. నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక సభను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదీ మా చిత్తశుద్ధి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నా. జగన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా, మాట్లాడవద్దా మేము. మేం మనుషులం కాదా? తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయితే ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని బొత్స అన్నారు. మంత్రి స్పందిస్తూ.. సమర్థించడం లేదని బొత్స మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారు కదా. అది సమర్థించడం కాదా? వైసీపీ మండలిపక్ష నేత బొత్స ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.