నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పలు కేసుల్లో 9 మంది దొంగల అరెస్టు – రూ.40 లక్షల విలువైన బంగారు – వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికారాలు మరియు మోటార్ సైకిళ్ల స్వాదీనం.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగతనాల వివరాలు వెల్లడించిన ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్
ఎస్పీ మాట్లాడుతూ….
ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు, వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగినదని తెలిపినారు.
దొంగతనాలు & నిందితుల వివరాలు :-
చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నరసరావు పేట ఇస్లాంపేట కు చెందిన షేక్ సుభాని అనే అతన్ని అరెస్టు చేసి, ఐదు కేసులలో అతను దొంగతనం చేసిన 170 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండి, రూ.10,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసినారు. ఈ ముద్దాయి పల్నాడు,ప్రకాశం బాపట్ల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి లింగం.ఎలమంద(ఐనవోలు గ్రామం), కొమ్మిరి శెట్టి. రామాంజనేయులు(ఐనవోలు గ్రామం) అను ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఎనిమిది మోటార్ సైకిళ్ళను స్వాదీనం చేసుకోవడం జరిగినది.
ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సచివాలయం, ఆయుష్మాన్ భవ భవనం నందు,రైతు భరోసా కేంద్రం లో మరియు కొచ్చేర్ల గ్రామ హై స్కూల్ నందు దొంగతనానికి పాల్పడిన జరపాల.వెంకటేశ్వర్లు(రేమిడిచర్ల గ్రామం) నాయక్, భూక్య. బాలాజీ నాయక్(రేమిడిచర్ల గ్రామం), పూడివలస. గణపతి@ గణేష్(ముప్పిడి గ్రామం పొలంకి మండలం శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ఏరియా పాత చెక్పోస్ట్ నందు నివాసం) అనే వాళ్ళని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి మట్టపల్లి.హరిబాబు ఎలియాస్ కమ్మ కాశి(మాచర్ల), చల్లా.భవాని శంకర్@ శంకర్(శంకర్), షేక్.మస్తాన్ వలి@ అత్తిలి (మాచర్ల) అను ముగ్గురిని అరెస్టు చేసి, వారు వద్ద నుండి 10 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ పైన పేర్కొన్న అన్ని దొంగతనాల కేసుల్లో సుమారు 40 లక్షల విలువైనటువంటి ఆస్తులని పోలీసులు రికవరి చేయడం జరిగినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కేసుల్లో సమగ్ర దర్యాప్తు జరిపిన చిలకలూరిపేట టౌన్ పోలీస్ సిఐ రమేష్ ని, ఐనవోలు,ఈపురు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ల ఎస్సై లను,వారి పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ అభినందించడం జరిగినది.
అదేవిధంగా పైన పేర్కొన్న అధికారులకు ఎప్పటికపుడు దిశా నిర్దేశం చేస్తూ ముద్దాయిలను అరెస్టు చేసి, దొంగిలించబడిన సొత్తును రికవరి చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన నరసరావుపేట మరియు గురజాల డిఎస్పి ల కృషిని ఎస్పీ అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.