Friday, September 19, 2025

ఆలోచింపచేసిన కవనవిజయం

నారద వర్తమాన సమాచారం

ఆలోచింపచేసిన కవనవిజయం

విజయవాడ, నవంబర్ 27: ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం నేతృత్వంలో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగుశాఖ పక్షాన కీ.శే. నాగభైరవ కోటేశ్వరరావు విరచిత “కవనవిజయం” సాహిత్య రూపకం 515వ ప్రదర్శన గురువారం సిద్ధార్థ ఆడిటోరియంలో ఆద్యంతం హృద్యంగా సాగింది. తొలుత సింహాద్రి జ్యోతిర్మయి కవులను సభకు పరిచయం చేశారు.
డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ప్రయోక్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. ఏడుకొండలు(ప్రబంధకవి),నట్టే ప్రసాద్ (భావకవి), కప్పగంతు జయరామయ్య(అభ్యుదయ కవి), ఈదుమూడి ఆంజనేయులు(విప్లవకవి),డా. నూనె అంకమ్మరావు (దిగంబరకవి),డా. బీరం సుందరరావు (దళితకవి), శ్రీమతి తేళ్ళ అరుణ(స్త్రీవాద కవయిత్రి), కసుకుర్తి శ్రీనివాసరావు(సినీకవి), నూకతోటి శరత్ బాబు(ప్రజాకవి), ఈదుమూడి జయంతి(నవలారచయిత్రి),
బత్తుల బ్రహ్మరెడ్డి (క్లార్క్ సూర్యారావు) కవితాగానం చేసి అలరింపచేశారు. సమకాలీన సమాజంపై ప్రముఖ కవుల అక్షర శతఘ్నులతో సభ మార్మోగింది. ఈ సాహిత్య రూపకాన్ని తిలకించిన విద్యార్థులు హర్షాతిరేకాలు తెలియచేశారు. కళాపీఠం పాలకవర్గసభ్యులు తాతినేని శ్రీహరిరావు, ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల, కవుల పాత్రలను పోషించినవారిని, సాహితీవేత్త డా. భూసురపల్లి వెంకటేశ్వర్లును ఘనంగా సత్కరించారు. తెలుగు శాఖాధిపతి డా. నందనవనం శివకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సశ్రీ, జి. శేషారత్నం ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ సాహితీ, కళాసంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పందిస్తూ ఈ సాహిత్య కార్యక్రమం ద్వారా ప్రముఖ కవుల పదునైన భావాలను, వారి సాహిత్య ప్రయోగాలను తెలుసుకోగలిగామన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version