నారద వర్తమాన సమాచారం
చిన్న పత్రికలు పడుతున్న ఇబ్బందులను మంత్రివర్యులు మరియు సమాచార శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పవరపు సాంబశివ నాయుడు
అమరావతి:-
అక్రిడేషన్ కమిటీలలో యూనియన్ నుంచి ఎంపిక చేసే సభ్యుల సంఖ్యను ఐదు నుంచి ఏడుకు పెంచాలని, ఎం ప్యానెల్మెంట్ సంబంధం లేకుండా స్థానిక పత్రికలకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథిని , సమాచార శాఖ డైరెక్టర్
హిమన్స్ శుక్లాను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు కోరారు
సచివాలయం ఐదో బ్లాక్ లో గుర్తింపు పొందిన రాష్ట్రస్థాయి యూనియన్ తో నూతన అక్రిడేషన్ విధానాన్ని ఎలా అమలు చేయాలని అంశంపై శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది
ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ నాయుడు ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి రాధాకృష్ణ లు హాజరై స్థానిక మరియు పిరియాడికల్ పత్రికల సంపాదకులకు అక్రిడేషన్ కమిటీలలో స్థానం ఇవ్వాలని కోరారు
చిన్న పత్రికల ఎడిటర్లు పడుతున్న కష్టాలను ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు పార్థసారథి దృష్టికి సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్స్ శుక్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఎడిటర్స్ యూనియన్ ప్రతిపాదనలను పరిగణంలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారదని సమాచార శాఖ డైరెక్టర్ హిమన్స్ శుక్లా ను ఎడిటర్స్ యూనియన్ అధ్యక్షులు సాంబశివ నాయుడు ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ లు సాలువతో సత్కరించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.