నారద వర్తమాన సమాచారం
అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ తనిఖీలు.
కాకినాడ:-
పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై వివరించారు.
రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం స్వయంగా వెళ్లి చూసిన పవన్ కళ్యాణ్ ఇటీవల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని పోర్టులోనే ఉంచిన అధికారులు.
కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపాటు
ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం
బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశంఅక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను పోర్టు అధికారులను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను పోర్టు అధికారులను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.