నారద వర్తమాన సమాచారం
శ్రీ సత్య సాయి జిల్లాలో విద్యార్థి కిడ్నాప్? హత్య?
శ్రీ సత్యసాయి జిల్లా:
శ్రీసత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న గురువారం కిడ్నాప్‌కు గురైన చేతన్ కుమార్ అనే విద్యార్థి కథ విషాదంగా ముగిసింది. చేతన్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఆపై బాలుడిని దారుణంగా హత్య చేశారు.
మడకశిర మండలం ఆమిదాలగొంది ప్రభుత్వ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ కిడ్నాప్‌కు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి విద్యార్థిని పాఠశాల నుంచి కిడ్నాప్ చేశారు.
చాలా సేపటి వరకు విద్యా ర్థి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో మడకశిర సరిహద్దున కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో విద్యార్థి శుక్రవారం తెల్లవారు జామున శవంగా కనిపించాడు. బాలుడు దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేం దుకు పోలీసులు యత్నిస్తున్నారు.
తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న చేతన్‌ను నిన్న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తీసుకెళ్లారు. విద్యార్థిని బైక్‌పై తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
అయితే దగ్గరి బంధువులే చేతన్‌ను పాఠశాల నుంచి తీసుకెళ్లినట్లు ఉపాధ్యా యులు చెబుతున్నారు.
పాఠశాల వదిలినప్పటికీ చేతన్ ఇంటికి రాకపోవ డంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడు చేతన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారంటూ తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.