ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్
తమ ప్రభుత్వం రవాణా రంగంలో ఎన్నో అద్భుతా లను సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో గురువారం ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. బహిరంగ సభ వేదిక వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ ను పరిశీలించిన సీఎం, డ్రైవిం గ్,సీట్లో కూర్చొని వాహనం యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే వెహికల్ స్కాపింగ్ పాలసీపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తుం దన్నారు. ప్రధానంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రవేశపె ట్టామని, లక్షల మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి చేకూరిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారు,జంగ్ సైరన్ మోగించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని, సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి హక్కుల కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారిని పరామర్శిం చేందుకు ఒక్క బి ఆర్ ఎస్ నేత కూడా వెళ్లలేదని, మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల హామీలను ప్రజల్లోకి బస్సుల ద్వారా తీసుకెళ్లిన ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని,115 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని,బస్సు ప్రయాణంతో రూ. 3902 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నట్లు తెలిపారు.
ఏడాది పాలనలో రవాణా శాఖ ఎన్నో విజయాలను సాధించిందని, గత ప్రభు త్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శిం చారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించిం దన్నారు. ఎందరో ఆర్టీసీ కార్మికుల కృషితో ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుందంటూ కార్మికు లను అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.