నారద వర్తమాన సమాచారం
గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి!: చైర్మన్ ఆనంద్ మహేంద్ర
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్కిల్స్ యూనివర్సిటీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్ల నిధులు కేటాయి స్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు సమావేశం జరిగింది.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి శ్రీధర్ బాబు, కో-చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కీలక అంశా లను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్కిల్స్ యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు కార్పొ రేట్లు ముందుకు రావాలని ఆయన కోరారు.
ప్రతి ఒక్కరూ తమకు తోచి న విధంగా యూనివర్సిటీకి సహాయం అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలు కలిగిన యువతను అందించాలన్న తన ఆలోచనను వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపా దనను తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. తెలంగాణ యువతకు నైపుణ్యాలు అందించాలన్న ఈ మహత్తర ఆలోచనను నేరవేర్చడంలో భాగస్వా మ్యం అవ్వడం గర్వంగా ఉంది అన్నారు.
అలాగే, సీఎం రేవంత్ రెడ్డి గొప్ప విజన్ ఉన్న నాయకు డని కొనియాడారు. ఆయన విజన్‌ను నమ్మి, యూనివ ర్సిటీ బోర్డు చైర్మన్ పదవిని సంతోషంగా స్వీకరించాను అని తెలిపారు. ఈ సమావే శంలో ఈ ఏడాదిలో ప్రారం భించనున్న పలు కోర్సుల వివరాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు యూనివర్సిటీ అభివృద్ధి పట్ల పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.