Thursday, December 12, 2024

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో కెల్లా ప్రథమస్థానం నాగార్జునసాగర్  దే….

నారద వర్తమాన సమాచారం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటితో 70 వసంతాల పూర్తి

ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా ప్రథమస్థానం

ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్‌ 10)తో 69 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10న డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ప్రముఖ ఇంజనీర్‌ కేఎల్‌ రావు, ముత్యాల జమీందార్‌ మహేశ్వరప్రసాద్‌ ఆలోచనలు మూలంగా చెప్పవచ్చు. ప్రాజెక్టు నిర్మాణానికి వేలాది మంది శ్రమజీవుల శ్రమశక్తి, వందలాది మంది ప్రాణార్పణలు నేటికీ మరువలేనివి. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1970లో పూర్తయింది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్‌ అలి నిబద్ధత కొనియాడదగింది. ప్రపంచ రాతినిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా నాగార్జునసాగర్‌ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం! నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది. గత 44 ఏళ్లుగా వచ్చిన వరదలకు రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 312 టీంఎసీలుగా ప్రభుత్వం నిర్ధారించింది. అంటే సుమారు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రిజర్వాయర్‌ కోల్పోయింది.
జవహర్‌ కెనాల్‌ కుడికాలువకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్‌ 10న శంకుస్థాపన చేశారు. అనంతరం ఈకాలువకు అ ప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న నీటిని విడుదలచేసి జాతికి అంకితమిచ్చారు. దీనిని జవహర్‌ కెనాల్‌ అని పిలుస్తారు. ఈ కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లా లో సుమారు 203కి.మీ. ప్రవహిస్తూ రైతన్నల ఆశాజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ కాలువ కింద ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. వీటికి 9 బ్రాంచ్‌ కెనాల్స్‌ కలిగి 5342 కి.మీ. పంటలకు నీటిని అందిస్తోంది. దీనికితోడు ఫీల్డ్‌చానల్స్‌ ద్వారా 14,400 కి.మీ. పంటలకు నీరు అందుతోంది.
లాల్‌బహుదూర్‌ కెనాల్‌ జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినాదించిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాసి్త్ర జ్ఞాపకార్థం సాగర్‌ ఎడమ కాలువకు లాలా బహుదూర్‌ కెనాల్‌ అని నామకరణం చేశారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ శంకుస్థాపన జరుపగా కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తోంది. మొత్తం 297కి.మీ. పరిధిలోని పొలాలకు సాగునీరు అందుతోంది. దీనికున్న 7బ్రాంచ్‌ కాలువల ద్వారా 7722 కి.మీ., ఫీల్డ్‌ చానల్స్‌ ద్వారా 9654 కి.మీ. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుంది. వీటికితోడు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలయ్యే నీటితో కృష్ణాడెల్టా ప్రాంత రైతులకు పంట లు పండించేందుకు ఉపయోగకరంగా ఉంది.
జలవిద్యుత్కేంద్రాలు నాగార్జునసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జలవిద్యుదుత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై నిర్మించిన 410 మెగావాట్ల ప్రధాన జలవిద్యుత్కేంద్రం, కుడి కాలువపై 90 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం, ఎడమ కాలువపై 60మెగావాట్ల జలవిద్యుత్కేంద్రాలను నిర్మించారు. వీటికితోడు కుడికాలువపై హైడల్‌ పవర్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రాష్ట్రంలో సాగు, తాగునీటితోపాటు విద్యుత్‌ కొరతను కూడా తీరుస్తోంది. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్టు అని కూడా అంటారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా… నాగార్జునసాగర్‌ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా పేర్గాంచింది. కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది. క్రీస్తు శకం రెండవ శతాబ్ధంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడవ శతాబ్ధం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్‌ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్కేంద్రాలను, కుడి, ఎడమ కాలువలను, మోడల్‌ డ్యాంను చూసేందుకు ప్రతిరోజూ వందలాది మంది దేశవిదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్‌ రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు …..

10 వేల మంది కూలీల ప్రాణ త్యాగం..
కొన్ని వేల మంది నిరంతర కృషి…
తెలుగుజాతి స్వప్నసాకారం..
నల్గొండ ల వరం…
ప్రపంచంలో నే మానవ నిర్మిత రాతి కట్టడం…
నాగార్జున సాగర్.

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar ) అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. తెలంగాణలో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో #నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి…

సాగర్‌ డ్యామ్‌ విశేషాలు… :-

మొత్తం రాతి కట్టడం పొడవు – 4,756 అడుగులు
ఎడమ వైపు మట్టికట్ట పొడవు – 8,400 అడుగులు
కుడి వైపు మట్టి కట్ట పొడవు – 2,800 అడుగులు
మొత్తం ఆనకట్ట పొడవు – 15,956 అడుగులు
రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు – 26
ఒక్కొక్క దాని ఎత్తు, పొడవు – 4,445 అడుగులు
గరిష్ఠ నీటి మట్టం – 590 అడుగులు
డెడ్‌ స్టోరేజీ లెవల్‌ – 490 అడుగులు
సాగర్‌ వద్ద సముద్ర మట్టం – 246 అడుగులు
స్పిల్‌వే వరకు డ్యామ్‌ ఎత్తు – 546 అడుగులు
రిజర్వాయరు వైశాల్యం – 110 చదరపు మైళ్ళు
జల విద్యుదుత్పాదన కేంద్రాలు..
ప్రధాన జలవిద్యుదుత్పాన కేంద్రం – 1
110 మెగావాట్లు – 7
సగటున ఏడాదికి విద్యుదుత్పాదన – 1,230 మిలియన్‌ యూనిట్లు
కుడి కాల్వ జలవిద్యుదుత్పాదన కేంద్రం 3130 మెగావాట్లు
సగటున ఏడాదికి విద్యుదుత్పాదన – 292 మిలియన్‌ యూనిట్లు
ఎడమ కాల్వ జలవిద్యుదుత్పాన కేంద్రం – 230 మెగావాట్లు
సగటు విద్యుదుత్పాదన – 127 మిలియన్‌ యూనిట్లు

డ్యామ్‌ నిర్మాణంలో ముఖ్యమైన సంఘటనలు… :-

1903 – కృష్ణానదిపై డ్యామ్‌ నిర్మాంచాలన్న ఆలోచన
1-4-1954 – ఆలోచనకు తుదిరూపం
10-12-1955 – ప్రాజెక్టుకు శంకుస్థాపన
10-2-1956 – డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది.
5-1967 – స్పిల్‌వే వరకు డ్యామ్‌ నిర్మాణం పూర్తి
4-8-1967 – ఎడమ కుడి కాల్వలకు నీటి విడుదల
15-5-1968 – రాతి కట్టడానికి ఆఖరి రాయి వేసిన రోజు
17-10-1974 రిజర్వాయరు 590 అడుగుల వరకు నింపిన తేదీ

డ్యామ్‌ నిర్మాణంలో నమ్మలేని నిజాలు…;-

  • నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 73 కోట్ల రూపాయలు మాత్రమే
    రోజుకు 45వేల మంది కార్మికులు 12 ఏళ్ళపాటు శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.
    సుమారు 10వేల మంది కార్మికులు మృతి చెంది ఉండవచ్చని అంచనా జలాశయం విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడవ స్థానం ఆక్రమించింది. రాతి కట్టడాలలో ప్రపంచంలోనే మొదటి స్థానం
    నీటి విడుదలలో సాగర్‌ కుడి కాల్వ ప్రపంచంలో మొదటిది పురావస్తు తవ్వకాలలో బుద్దుని ధాతువు(శరీరంలో ఒక భాగం) సాగర్‌ రిజర్వాయరు ప్రాంతంలో లభించింది. ప్రస్తుతం నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరిచారు.

ఆయకట్టు వివరాలు :-

ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో తయారైన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

కుడి కాలువ:-

జిల్లా ఆయకట్టు, ఎకరాల్లో
గుంటూరు జిల్లా 6,68,230
ప్రకాశం జిల్లా 4,43,180
మొత్తం 11,11,410

ఎడమ కాలువ:-

జిల్లా ఆయకట్టు, ఎకరాల్లో
నల్గొండ జిల్లా 3,72,970
ఖమ్మం జిల్లా 3,46,769
కృష్ణా జిల్లా 4,04,760
మొత్తం 11,24,500
పెద్ద మొత్తం 22,35,910
ప్రాజెక్టు గణాంకాలు
డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.)
ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ)
మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.)
ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.)
కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.)
మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26
కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.
జలాశయ సామర్థ్యం
నాగార్జున సాగర్ జలాశయం
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)
కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి.
విద్యుదుత్పత్తి సామర్థ్యం
నాగార్జున సాగర్ జలాశయము
విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మె.వా. (మెగా వాట్లు)
నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా.,
కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా.,
ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా.
ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలు ఉన్నాయి.

ఆధునిక ప్రపంచములోని మానవనిర్మిత నీటిపారుదల ప్రాజెక్ట్ లలో ”అత్యధ్భుతమైన” నిర్మాణం నాగార్జునసాగర్ డ్యాం. ఈప్రాజెక్ట్ నల్గొండ..గుంటూరు జిల్లాల సరిహద్దులలో నిర్మించబడినది. 1955 డిసెంబరు 10 వ తేదీ మన మొదటి ప్రధానమంత్రి శ్రీజవహర్ లాల్ నెహ్రూ గారు ఈప్రాజెక్ట్ కు శంకుస్ధాపన చేశారు.1967 వ సం.లో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చేత ఈడ్యాం ప్రారంభించబడినది.
ఈ అధ్భుత నిర్మాణం ఎత్తు 124 మీటర్లు. పొడవు 1550 మీటర్లు. ఈడ్యాం నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు 132 కోట్ల రూపాయలు. దీనికి చీఫ్ ఇంజనీరు గా కృష్ణా జిల్లా కు చెందిన కె.యల్ రావు గారు పనిచేశారు.

సేకరణ


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version