నారద వర్తమాన సమాచారం
పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తి చేయాలి.
,ప్రతి ప్రభుత్వ పథకం పేదవారికి అందించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి – ప్రత్తిపాటి పుల్లారావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నేతలంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్ర పార్టీ మనకు ఇచ్చిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని పార్టీ నేతలకు మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దిశా నిర్దేశనం చేశారు.ప్రత్తిపాటి పుల్లారావు నివాసంలో బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జి లతో వారు సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.ఈ సంధర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ 5 లక్షల భీమా సౌకర్యాన్ని రెండు సంవత్సరాలపాటు కల్పిస్తున్న విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేస్తే మరింత మంది క్రియాశీల సభ్యులుగా పార్టీలో చేరతారని వారు తెలిపారు. అలాగే రాష్ట్ర పార్టీ నిర్దేశించిన సభ్యత్వ లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు.అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి, త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్ పథకం వంటి సామాన్య ప్రజలు ఆశించే వివిధ పథకాలను,అర్హులైన పేదవారికీ అందే విధంగా పార్టీ శ్రేణులు పని చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో నెల్లూరి సదాశివరావు,షేక్ కరిముల్లా,సుభాని మరియు 3 మండలాల అద్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








