నారద వర్తమాన సమాచారం
వినియోగదారుల రక్షణ చట్టం పై అందరూ అవగాహన కలిగి ఉండాలి : పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు పిల్లి యజ్ఞ నారాయణ
పిడుగురాళ్ల
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం ఏంజెల్ ప్రైడ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ అందరూ వినియోగదారుల రక్షణ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని, వస్తువు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, నష్టం జరిగినప్పుడు కొత్త వస్తువును మరియు నష్టపరిహారంను వినియోగదారుల కోర్టు నుండి పొందే వీలుంటుందని, అందుకు బిల్ తప్పనిసరి అని, తయారీదారుని అడ్రస్ మరియు లైసెన్సు వివరాలు లేని వస్తువులను కొని మోసపోవద్దని, ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ తేదీ, తయారు తేదీ, తయారుదారిని వివరాలు, మొబైల్ నెంబర్ మొదలగునవి తప్పనిసరిగా పరిశీలించి గడువు తీరిన వస్తువులను కొని నష్టపోవద్దని తెలియజేశారు. గ్యాస్ డెలివరీ సమయం లో గ్యాస్ డెలివరీ గౌడౌన్ నుండి 15 కిలోమీటర్ల పరిధిలో డెలివరీ చార్జెస్ క్రింద ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదని, గ్యాస్ ప్రమాదం జరిగితే ఏజన్సీ ద్వారా నష్టపరిహారం పొందే వీలుందని అందుకు గ్యాస్ డెలివరి అడ్రస్ లోనే బాధితుడు నివాసం ఉండాలని, కల్తీ ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటి ఆహరం తినకుండా ఉండటం మంచిదని తెలియజేసారు. అలాగే బజ్జిలు పునుగులు తయారుచేసే బండ్ల వద్ద మరిగించిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతుంటారని అది విషంతో సమానం అని అటువంటి వాడిన నూనెతో చేసే ఆహారపదార్థాలు తినవద్దని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వినియోగించే టేస్టింగ్ సాల్ట్ చాలా ప్రమాదకరమని అది చైనా నుంచి పురుగుమందుగా భారతదేశానికి దిగుమతి అవుతుందని, దానిని ఆహార పదార్థాలలో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఎక్కువగా వాడటం వలన ప్రజలు ఎక్కువ అనారోగ్య పాలవుతున్నారని, కాబట్టి టెస్టింగ్ సాల్ట్ వినియోగించిన ఆహార పదార్థాలను తినవద్దని తెలియజేశారు. అలాగే ఆన్లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని, సేవా లోపం పై కూడా వినియోగదారుల కోర్టు నుండి నష్టపరిహారం పొందే హక్కు ఉందని తెలియజేసారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ కమీషనర్ గారు వినియోగదారుల అవగాహన నిమిత్తం తయారుచేసిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బీ.వీ. కృష్ణారెడ్డి, సంస్థ లీగల్ అడ్వైజర్ మరియు స్కిల్ హబ్ ట్రైనర్ ఆవులమంద కమలాకర్, స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ పి శ్రీకాంత్, స్కిల్ హబ్ ట్రైనర్ షేక్ మస్తాన్, సీనియర్ జర్నలిస్ట్ పొన్నెకంటి శ్రీనివాసాచారి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.