నారద వర్తమాన సమాచారం
వినియోగదారుల హక్కులపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలి – పల్నాడు జిల్లా డి.ఎస్.ఓ ఎం.వి.ప్రసాద్
పల్నాడు జిల్లా,
వినియోగదారుల హక్కుల పై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని, వినియోగదారుల పై జరుగుతున్న మోసపూరిత చర్యలను తెలివితో అవగాహనతో అడ్డుకోవాలని అందుకు విద్యార్థి దశ నుంచి ప్రయత్నించాలని పల్నాడు జిల్లా పౌర సరఫరా అధికారి ఎం.వి.ప్రసాద్ తెలిపారు. శనివారం వినియోగదారుల హక్కులపై అవగాహన లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట శ్రీ లాల్ బహదూర్ పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నందు ఏ.పి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ఏంజెల్ ఫ్రైడ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన వినియోగదారుల రక్షణ చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలి నిర్వహించి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వస్తువు ఏదైనా కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాలన్నారు. అదేవిధంగా వస్తూ నాణ్యత, ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. వస్తువు కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారుడు నష్ట పోతే కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం పొందవచ్చునని తెలిపారు.. వినియోగదారుల కోర్టులో వినియోగదారుడు కేసు స్వయంగా వాదించుకోవచ్చునని తెలిపారు. ఏంజల్ ప్రైడ్ కాన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వినియోగదారులు సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మరియు పల్నాడు జిల్లా విజిలన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ తినుబండారాలు అలాగే, త్రాగే నీరు పరిశుభ్రంగా ఉండేలాచూసి పరిశీలించుకుని, వినియోగించుకోవాలని, ఐఎస్ఐ. అగ్మార్క్ బిఐఎస్, హాల్ మార్క్ ఇటువంటి వాటి గురించి తెలుసుకొని ఆయా వస్తువులు కొనుగోలు చేయవలెను అని అన్నారు. అదేవిధంగా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తునందున రేషన్ బియ్యాన్ని ప్రతి ఒక్కరు
వినియోగించుకోవాలని, దళారులకు అప్పచెప్పొద్దని, అదే విధంగా పోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తుందని, అవి నీటిలో తేలతాయని అవి ప్లాస్టిక్ బియ్యం కాదని వాటిని వినియోగదారులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు నకిలీవి కాకుండా ప్రభుత్వ అనుమతి పొందిన షాపులలో ప్రభుత్వం అనుమతి పొందిన విత్తన తయారీదారు సంస్థల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాల వల్ల నష్టపోయిన కుటుంబాల వారు సంబంధిత ఏజన్సి ద్వారా నష్టపరిహారం పొందవచ్చునని అన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ కి 15 కిలోమీటర్ల పరిధిలో లోపు ఎటువంటి చార్జి చెల్లించనక్కర్లేదని తెలిపారు.. గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండర్ను కాటా వేసి వినియోగదారుడు చూపించి ఇవ్వవలసిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏంజెల్ ఫ్రైడ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ పల్నాడు జిల్లా ఉప కార్యదర్శి, నరసరావుపేట మండల విజిలన్స్ కమిటీ సభ్యులు షైక్ షాముల్ల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.సాంబయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







