Sunday, January 5, 2025

పల్నాడు జిల్లా పోలీస్ వార్షిక నేర సమీక్ష-2024

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్

వార్షిక నేర సమీక్ష-2024

పోలీస్ శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు,మెరుగైన పోలీసింగ్ తో నేరాల తగ్గుదల :- పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గ

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ
2022లో మొత్తం 4712 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 4578 కేసులు నమోదయ్యాయి మరియు 2024లో 4,222కేసులు నమోదు అయ్యాయి.

2023 వ సంవత్సరంలో 133 కేసులు తగ్గాయి.2024 వ సంవత్సరంలో 356కేసులు తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే నివేదించబడిన కేసులలో 7.7% తగ్గుదల ఉంది.

పోలీసులు సమర్థ వంతంగా పని చేయడం వల్లే నేరాలు తగ్గాయని తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందిస్తామని తెలియచేశారు.

నేరాల నియంత్రణ:-
పల్నాడు జిల్లాలో నేర గణాంకాల శాతం బాగా తగ్గింది, గత సంవత్సరంతో పోలీస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయి. నేరస్తులను నియంత్రించడం ద్వారా క్రైమ్ కంట్రోల్ లో ఉంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసు శాఖలో అమలు చేస్తున్న విధానం ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభించడమే కాకుండా పోలీస్ వ్యవస్ధపై బాధితులకు నమ్మకం పెరగటం అన్నది జరుగుతుంది. ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలో కేసులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసి దర్యాప్తు చేయుటకు ప్రతీ దర్యాప్తు అధికారికి కొన్ని ప్రధానమైన కేసులను అప్పగించడం వలన వారు కోర్ట్ యందు విచారణ సమయం లో ప్రాసిక్యూషన్ అధికారుల భాగస్వామ్యంతో కేసులలో విచారణ త్వరితగతిన పూర్తిచేయడం వలన 661 కేసులలో నిందితులకు శిక్ష లు ఖరారు అయినవి.

హత్య కేసులు:
• 2022లో మొత్తం 37 కేసులు నమోదయ్యాయి 2023లో మొత్తం 40 కేసులు నమోదయ్యాయి.
2024 లో 44 కేసులు నమోదు అయ్యాయి
• హత్యల పెరుగుదల శాతం 10 %.
ఈ సంవత్సరం నాలుగు కేసులలో జీవిత ఖైదు కోర్టుల ద్వారా విధించడం జరిగింది.

ప్రాపర్టీ కేసులు:
• 2022లో మొత్తం 603 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 344 కేసులు నమోదయ్యాయి. 2024లో మొత్తం 520 కేసులు నమోదయ్యాయి.

  • 2024సం.లో 55% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తగ్గిన రోడ్డు ప్రమాదాలు:-
    ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా జరిగే బ్లాక్ స్పాట్, ప్రమాదాలు జరిగే సమయంను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతినెలా ప్రమాదలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, స్టాప్ బోర్డులు ఏర్పాటుచేయటం, నిరంతర వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్, ప్రత్యేక అవగాహన సదస్సులు, ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ ను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం జరిగింది. SC-ST కేసులు:
    • 2022 సంవత్సరంలో మొత్తం 86 కేసులు నమోదయ్యాయి. 2023 సంవత్సరంలో మొత్తం 106 కేసులు నమోదయ్యాయి మరియు 2024లో మొత్తం 236 కేసులు నమోదయ్యాయి. మహిళల పై నేరాలు:
    • 2022 సంవత్సరంలో, మొత్తం 713 కేసులు నమోదయ్యాయి, 2023 సంవత్సరంలో, మొత్తం 274 కేసులు నమోదయ్యాయి, 2024 సంవత్సరంలో, మొత్తం 502 కేసులు నమోదయ్యాయి.
    • 2022 నుండి 2023 మధ్య 439 కేసులు తగ్గాయి కానీ 2023 నుండి 2024 మధ్య 230 కేసులు పెరిగాయి. పోక్సో చట్టం కేసులు:
    • 2022 సంవత్సరంలో, మొత్తం 81 కేసులు నమోదయ్యాయి, 2023 సంవత్సరంలో, మొత్తం 29 కేసులు నమోదయ్యాయి, 2023 సంవత్సరంలో, మొత్తం 50 కేసులు నమోదయ్యాయి. 2023 వ సంవత్సరంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య 21 పెరిగాయి.

మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు:-
మహిళల పైన మరియు చిన్న పిల్లల పైన జరిగే లైంగిక దాడులకు సంబందించి నమోదైన కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని అత్యంత ప్రాముఖ్యమైన కేసులగా పరిగణించి కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారుల స్వీయ పర్యవేక్షణలో కేసు యొక్క ట్రైల్ సమయాన్ని ఘననీయంగా తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరానికి పాల్పడిన వారికి జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్షలు పడేవిధంగా చేయడం జరుగుతుంది. హేయమైన నేరాలకు ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలపైన లైంగిక నేరాలకు పాల్పడిన కేసులలో ఈ సంవత్సరం జిల్లా లో 6 కేసులలో నిందితులకు శిక్షలు పడగా వాటిలో నేరస్థులకు జీవిత ఖైదు పడినవి.

సైబర్ క్రైమ్ మరియు ఐటీ చట్టం కేసులు:
• 2022 సంవత్సరంలో, మొత్తం 27 కేసులు నమోదయ్యాయి, 2023 సంవత్సరంలో, మొత్తం 20 కేసులు నమోదయ్యాయి, 2024 సంవత్సరంలో, మొత్తం 60 కేసులు నమోదయ్యాయి.

సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేక సైబర్ సెల్ మరియు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ అధికారి పర్యవేక్షణలో సిబ్బందికి సైబర్ నేరాల నియంత్రణ కోసం కీలకమైన అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించి సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. OTP సంబందిత మూసాల గురించి అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం తోపాటు అదే సోషల్ మీడియా వేదికగా వారిపైన కేసు నమోదుకు గల కారణాలను వివరించడం ద్వారా సోషల్ నేరాలను అరికడుతున్నాము.

లోక్ అదాలత్ కేసుల పరిష్కారం:
• 2022 సంవత్సరంలో, మొత్తం 2,960 కేసులు పరిష్కరించబడ్డాయి, 2023 సంవత్సరంలో, మొత్తం 5683 కేసులు పరిష్కరించబడ్డాయి, 2024 సంవత్సరంలో, మొత్తం 3522 కేసులు పరిష్కరించబడ్డాయి.

ఫాక్షన్: పల్నాడు జిల్లాలో మొత్తం 11 మండలాలలోని 32 గ్రామాల్లో గతంలో ఫ్యాక్షన్ ఉంది. 2024లో 617 మందిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది.

కమ్యూనిటీ బేస్డ్ పోలీసింగ్ లో భాగంగా పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతి ఒక్క పోలీసు అధికారి తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో రాత్రిపూట సంచరిస్తూ, గ్రామస్తులతో మమేకమై వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా సాగుతూ రాత్రి పూట అక్కడ బసచేయడం జరుగుతున్నది.

పల్నాడు జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండే గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో శాంతిభద్రతలు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తూ, హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ అను మూడు విధాలుగా సదరు గ్రామాలను విభజించి, హైపర్ సెన్సిటివ్ మరియు సెన్సిటివ్ ఉన్న గ్రామాలలో సమస్యాత్మక వ్యక్తుల గురించి నిరంతరం నిఘా వుంచి ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి, వారి యొక్క కదలికలను గమనిస్తూ నేరాలు జరగకుండా ముందస్తుగా సమాచారాన్ని సేకరించి తదుపరి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
నదీ పరివాహక ప్రాంతాలు, తండా గ్రామాలు మరియు నల్లమల్ల అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తూ, తయారీదారులపై ఉక్కు పాదం మోపుతూ నాటు సారా బట్టిలను తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడo జరుగుతున్నది. అదేవిధంగా నాటు సారానే జీవనోపాధిగా కొనసాగిస్తున్న ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలుగా కుటీర పరిశ్రమలు మరియు ఇతర జీవనోపాధి మార్గాలను జిల్లా అధికారులతో మాట్లాడి కల్పించడం జరుగుతున్నది.


మరింత మెరుగైన పోలిసింగ్ కోసం తీసుకోవాల్సిన చర్యల పైనా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం:-

జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా ఫుట్ పెట్రోలింగ్, పెట్రోలింగ్, బీట్స్ సంఖ్యను పెంచి, అనుమానితుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గంజాయి సేవించే మరియు అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెంచాలని, గంజాయి కేసులలో కూడా నిర్దేశిత సమయానికి చార్జ్ షీట్ వేయాలని ఆదేశించారు.
పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ వాటి సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుధారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.
సిబ్బంది అందరు తమ విధులలో మెరుగైన పనితీరు చూపించాలని ఆదేశించారు.
మహిళా సంబంధిత కేసులలో ఎటువంటి అలసత్వం లేకుండా దర్యాప్తు చేయాలని మరియు ఎక్కడా మహిళలపై ఈవ్ టీజింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.
ట్రాఫిక్ పరంగా బ్లాక్ స్పాట్ లను గుర్తిస్తూ తగు చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఈ సందర్భంగా  ఎస్పి  ఆదేశించారు.

ఆవిష్కరణలు
మీతో మేము ప్రోగ్రాం
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ట్రాఫిక్ నియంత్రణ
ట్రాఫిక్ నియంత్రణ మరియు నిఘాలో భాగంగా డిజిటల్ బారికెట్లను మరియు మూడు అధునాతన గస్తీ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టడం జరిగింది.
మీడియా సమావేశం అనంతరం ఎస్పీ మీడియా వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ తో అదనపు ఎస్పీ(పరిపాలన) JV సంతోష్  ఏఆర్ అదనపు ఎస్పి సత్తి రాజు  డీఎస్పీలు Y. హనుమంతరావు  జగదీష్ , పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version