పల్నాడు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరికలు
నరసరావుపేట సంక్రాంతి పండుగ వేడుకల పేరుతో జిల్లాలో ఎక్కడైనా జూదం కోడిపందెలు నిర్వహిస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుకోవాలన్నారు. గతంలో నిర్వాహకులపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు కావద్దన్నారు. సమాచారం ఉంటే 112కు వెంటనే తెలియజేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.