నారద వర్తమాన సమాచారం
సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన కాంతులను, సంతోషాలను నింపాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఐ పీ ఎస్
మన జీవన శైలితో ముడిపడిన సంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి పండుగను తెల్లవారుజామున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా సంప్రదాయ బద్ధంగా భోగిమంటలను వేసినారు.
తెలుగింట సంతోషంగా జరుపుకునే సంక్రాంతి మానవ సంబంధాలను పెంపొందిస్తుందని, పాత ఆలోచనలు, దుఃఖాన్ని వదిలివేసి సరికొత్త ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా సంక్రాంతి పండుగను జరుపుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ముఖ్యంగా రైతు కష్టానికి ప్రతిఫలంగా ధాన్యపు బస్తాలు వారి ఇంటికి చేరే ఈ పండుగతో వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలకు కూడా అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. ప్రకృతితో మమేకమయ్యే ఈ సంప్రదాయ పండుగను ప్రతి ఒక్కరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటేలా, తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా సుందరమైన, కళాత్మకమైన రంగవల్లులు తమ క్యాంప్ ఆఫీసు ముందు తీర్చిదిద్దినారు.
జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ముందుగా సంక్రాతి శుభాకాంక్షలు తెలియచేసినారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన కాంతులను, సంతోషాలను నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు,పేకాట వంటి జూదాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా మరియు సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ హెచ్చరించారు. సాంప్రదాయం క్రీడలు నిర్వహించుకోవాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.