కేజ్రీవాల్ ను ఓడించిన వ్యక్తి.. ఎవరీ పర్వేష్ వర్మ..?
ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు.
కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంతో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది.
డిల్లీ మాజీ సీఎం కుమారుడు..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాబిబ్ సింగ్ వర్మ. 1996 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 1998 అక్టోబర్ 12 వరకు పర్వేజ్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు.
జాట్ కుటుంబానికి చెందిన ఇతడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.
తర్వాతి ఏడాదే పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 లక్షల 68 వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు.
ఆ తర్వాత ఓటమనేదే ఎరుగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు.
ఓటమి ఎరుగని నేత పర్వేష్.. రికార్డు రిపీట్..!
ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కే చెమటలు పట్టించిన పర్వేశ్ వర్మ తన రాజీకయ జీవితంలో ఎప్పుడూ ఓటమనేదే ఎరుగరు.
తాజాగా న్యూ ఢిల్లీలోనూ అదే రికార్డు రిపీట్ చేశారు.
రాజకీయ విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ న్యూ ఢిల్లీలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించి పీడ కలను మిగిల్చారు.
ఇప్పటికే జంగ్‌పురాలో ఆప్ అగ్రనేత మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
కల్కాజీలో సీఎం ఆతిషీ గెలుపు ఒక్కటే ఆప్ పార్టీకి ఊరటనిచ్చే అంశం.
ఇక కేజ్రీవాల్‌పై గెల్చిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.