నారద వర్తమాన సమాచారం
ఇళ్ల స్థలాల పొందిన లబ్ధిదారుల జాబితాపై పునర్విచారణ
▪️ రెవెన్యూ ఉద్యోగులతో విచారణ కమిటీ
▪️ ఈ నెల 15 కల్లా ప్రభుత్వానికి నివేదిక
వైసిపి హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పునర్విచారణ కోసం ఈ నెల 10 నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వారిని గుర్తించాల్సి ఉంటుంది. సమాచారాన్ని నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ ప్రక్రియను ఆయా మండలాల్లో స్థానిక తహశీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయరు, విఆర్వో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని 26 జిల్లాల కలెక్టర్లను సిసిఎల్ఎ జయలక్ష్మి ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.