నారద వర్తమాన సమాచారం
మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబవుతున్న కోటప్పకొండ
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు దేవదాయశాఖ సుందరీకరణ, వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. భక్తులకు వసతులు కల్పించేందుకు రూ.కోటి నిధులు వ్యయం చేస్తున్నారు.
శివ కుటుంబం విగ్రహానికి వేసిన రంగులు
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు దేవదాయశాఖ సుందరీకరణ, వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. భక్తులకు వసతులు కల్పించేందుకు రూ. కోటి నిధులు వ్యయం చేస్తున్నారు. వీటిలో భక్తులకు మరుగుదొడ్లు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు పనులు చేస్తున్నారు. కోటప్పకొండ స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన శివ కుటుంబం విగ్రహానికి రంగులద్దే పనులు కొనసాగుతున్నాయి. రూ.40లక్షలతో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు శాశ్వత ప్రాతిపదికన చేస్తున్న నిర్మాణాలు పూర్తి చేశారు. దివీస్ ల్యాబ్స్ అందజేసిన వాటర్హౌంట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. గంటకు వెయ్యి లీటర్ల నీటిని శుద్ధి చేసే పరికరాలు ఇందులో ఉన్నాయి.
ప్రశాంత దర్శనానికి ఏర్పాట్లు
త్రికోటేశ్వర స్వామి దేవస్థానం, సహాయ కమిషనర్ దాసరి చంద్రశేఖర రావు మాట్లాడుతూ
తిరునాళ్లకు 20లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాలతో వసతులు కల్పిస్తున్నామని . దేవాలయ నిధుల నుంచి రూ.కోటి వ్యయం చేస్తు ఉచిత, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని . వికలాంగులు, వయోవృద్ధుల కోసం లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉందని . భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ స్వచ్చంద సేవాసంస్థల సహకారంతో చేయనున్నామని . అంతే కాకుండా శానిటేషన్ పై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నామని . భక్తులకు విక్రయించేందుకు 2లక్షల లడ్డులు, లక్ష అరిసెలు తయారు చేయిస్తున్నామని . తిరునాళ్ల రోజున అభిషేకాలు చేయించుకునేందుకు మండపంలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ఆయనతోపాటు ఆలయ సూపర్డెంట్ చల్లా శ్రీనివాసరావు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.