నారద వర్తమాన సమాచారం
పల్నాడు పోలీస్
అద్దంకి to నార్కెట్ పల్లి హైవే పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్వయంగా వెళ్లి పరిశీలించిన ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
రాజుపాలెం మండలం పెద నెమలిపురి గ్రామ శివారులో అద్దంకి to నార్కెట్ పల్లి హైవే రోడ్డులో గల లక్ష్మీ తిరుపతమ్మ గుడి వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి ఎస్పీ ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది.
ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.
మరొకరిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ హుటాహుటిన ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును స్వయంగా పరిశీలించినారు.
నేరం జరగడానికి గల కారణాలను ఎస్పీ సత్తెనపల్లి రూరల్ సిఐ ని మరియు రాజుపాలెం ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు.
మృతులు హైదరాబాదు నుండి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో జరుగు శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సత్తెనపల్లి రూరల్ సీఐ ఎస్పీ కి వివరించారు.
మృతదేహల ను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ తో పాటు పల్నాడు జిల్లా DTO G. సంజీవ్ కుమార్ , పిడుగురాళ్ల MVI Ch. రాంబాబు , హైవే ఇంజనీర్, రామకృష్ణ సత్తెనపల్లి రూరల్ సీఐ MV. సుబ్బారావు , రాజుపాలెం ఎస్సై వేణుగోపాల్ , నకరికల్లు ఎస్సై జిల్లా సురేష్ బాబు ఉన్నారు.
ప్రమాదం వివరాలు
రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురం గ్రామ శివారులో అద్దంకి to నార్కెట్ పల్లి హైవే రోడ్డులో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గుడి వద్ద AP 39UW0055 అను నెంబర్ గల సిమెంట్ ట్యాంకర్ నెల్లూరు నుండి దాచేపల్లి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకు వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తులో హైవే రోడ్డులో గల డివైడర్ ను గుద్ది లారీ రాంగ్ రూట్ లోనికి వెళ్లి సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడటం వలన పిడుగురాళ్ల వైపు నుండి ప్రకాశం వైపు వెళుతున్న AP 39 QD 6289 నెంబర్ గల మారుతి స్విఫ్ట్ డిజైర్ కారుపై ట్యాంకర్ పడటం వలన కారులో ప్రయాణిస్తున్న ఫేక్ నజీరా, షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లా పెద్ద కొత్తపల్లి గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా అనువారి లో ఒక ఆడమనిషి ఒక మగమనిషి అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని కారులో నుండి బయటకు తీసి దెబ్బలు తగిలిన లారీ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్ లో నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కారు డ్రైవర్ చనిపోవడం జరిగింది.
మృతిచెందిన మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది రాజుపాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.