నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్
దాచేపల్లి అలంకార్ ధియేటర్ సమీపంలో గొఱ్ఱెల పైకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన వెళ్లి స్వయంగా పరిశీలించిన ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర అలంకార్ థియేటర్ సమీపంలో అద్దంకి to నార్కెట్ పల్లి హైవేపై తెల్లవారుజామున గురజాల మండలం పులిపాడు నుండి దాచేపల్లి వైపు వెళ్తున్న గొర్రెలను హైదరాబాదు నుండి ఇంకొల్లు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ అయిన మారుతీ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడం జరిగింది.
ఈ ఘటన లో 147 గొర్రెలు చనిపోగా
40 గొర్రెలు గాయపడటం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ హుటాహుటిన ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును స్వయంగా పరిశీలించారు.
ప్రమాదం జరగడానికి గల కారణాలను ఎస్పీ దాచేపల్లి సిఐ ని అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదం జరిగినపుడు గాయపడిన గొఱ్ఱెల కాపరి అయిన ఆవుల మల్లేష్ తండ్రి బాలరాజు,మహబూబ్ నగర్ జిల్లా,తెలంగాణ రాష్ట్రం అను అతనిని చికిత్స నిమిత్తం గురజాల గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
ఈ ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మరియు ట్రావెల్స్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ తో పాటు అడ్మిన్ ఎస్పీ J.V. సంతోష్ , సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు ,ఎస్బి సిఐ బండారు సురేష్ బాబు దాచేపల్లి సీఐ భాస్కర్ గురజాల సిఐ ఆవుల భాస్కర్ మరియు యస్.ఐ లు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.