నారద వర్తమాన సమాచారం
మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్దమైన శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం
సత్తెనపల్లి,
సత్తెనపల్లి పట్టణంలో గుంటూరు రోడ్ నందు బ్రహ్మశ్రీ స్వప్రకాష్ గురూజీచే 1939 లో నిర్మించబడిన శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయినట్లు ఆశ్రమం వంశ పారంపర్య ధర్మకర్త చింతాడ లలితాంబ మాతాజీ తెలిపారు. ఆశ్రమంలోని మల్లిఖార్జున, పాదరస, ద్వాదశ జ్యోతిర్లింగాలకు మహాన్యాస పూర్వక అభిషేకాలు… శివ, బ్రహ్మం, విశ్వేశ్వర స్వామివార్ల త్రి కల్యాణం జరుగుతాయన్నారు… శివరాత్రి పర్వదినం బుధవారం ఉదయం రుద్ర చండీ హోమం, శివకల్యాణం.. మధ్యాహ్నం అన్నదానం జరుగుతుందన్నారు. శివరాత్రి రోజు రాత్రి7 గంటలనుండి సహస్ర లింగోద్భవం,పరంజ్యోతి దర్శనం,ఆధ్యాత్మిక సంగీత విభావారి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం సహస్ర లింగోద్భవం, పరంజ్యోతి కార్యక్రమాలను సోమవారం నుండి బుధవారం వరకు విశ్వ సృష్టి సెంట్రల్ చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చింతాడ బ్రహ్మానందరావు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని మాతాజీ కోరారు. మూడు రోజులపాటు జరగనున్న కార్యక్రమాలకు భక్తులకు కావలసిన సౌకర్యాలు చేసినట్లు ఆశ్రమం ట్రస్ట్ వారు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.