నారద వర్తమాన సమాచారం
యానాదులు చెత్తన సేకరించే వృత్తి నుండి వ్యాపారంగంలోకి మార్పు చెందాలని వారికి నాలుగు చక్రాల బండ్లను పంపిణీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు…
చెత్తను సేకరించే వృత్తి నుంచి వ్యాపార రంగంలోకి ఎస్టీ యానాదులు మార్పు చెందాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నందు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వేస్ట్ పికర్స్ కి జీవనోపాదులు మెరుగుపరుచుకునేందుకు వారికి నాలుగు చక్రాలు, మూడు చక్రాల బల్ల బండ్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ డి బి ఆర్ సి సంస్థ మీకు ఇచ్చిన బండ్లను వ్యాపార రంగంలో ఉపయోగ పెట్టుకుని అభివృద్ధిని సాధించాలని, బండ్లను పాడు చేసుకోకుండా భవిష్యత్తులో మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి చదివించాలని, ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తుందని ప్రభుత్వం మరియు డి బి ఆర్ సి సంస్థ ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీ జీవితాలలో మార్పు సాధించేందుకు మీరు కృషి చేయాలని, దానితోపాటు ప్రభుత్వం, కూడా మీ అభివృద్ధికి కృషి చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప నరసరావుపేట ఏరియా కోఆర్డినేటర్ తోకల సాంబయ్య బల్ల బండ్లు హక్కుదారులు పాల్గొన్నారు. డిబిఆర్సి చేస్తున్నటువంటి సహాయ, సహకారాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు డి బి ఆర్ సి సంస్థ డైరెక్టర్ అల్లడి దేవకుమార్, డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనిల్ కుమార్ ని అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.