నారద వర్తమాన సమాచారం
నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా భర్తీకి రెడీ!
▪️దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి
▪️సిద్ధమౌతున్న 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా.
▪️చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు.
▪️ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు.
రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక చేరింది. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరినట్టు సమాచారం. మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్దమైంది.
సిద్ధమౌతున్న మార్కెట్ యార్డ్ కమిటీలు
వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి కసరత్తును మొదలుపెట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీచేయనుంది. ఎస్సీ, ఎన్టీ, బీసీలతో పాటు ఓసి లకు సమ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు సిద్దమౌతున్నాయి. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. రాష్ట్రం లో 222 మార్కెట్ కమిటీలు ఉండగా వీటన్నిటికీ చైర్మన్తో పాటు 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. 50 శాతానికి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.