నారద వర్తమాన సమాచారం
జిల్లాలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయండి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
జిల్లాలో బైక్ రైడర్లు తప్పకుండా హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో బైక్ రైడర్లు హెల్మెట్ వినియోగించకాపోవడం ఆందోళనకరమన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
రహదారులపై ప్రమాదాలు, ప్రమాదాల కారణంగా మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 34 బ్లాక్ స్పాట్లలో వాహనదారులు రాత్రి వేళల్లో సైతం గమనించే విధంగా సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో 3256 సీసీ కెమెరాలతో నిర్వహిస్తున్న రహదారి సర్వేలెన్స్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలన్నారు. ప్రతి సీసీ కెమెరా నిరంతరం పని చేసే విధంగా వాటి నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.
18 ఏళ్ల లోపు యువత వాహనాలు నడపడం, అధిక వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం నిరసిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ, ఆర్డీవో మధులత, జిల్లా రవాణా అధికారి, డీఎంహెచ్ఓ బి.రవి మరియు ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.