నారద వర్తమాన సమాచారం
సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు జ్యోతిరావు పూలే : పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఐఏఎస్
నరసరావుపేట:
సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తీ ,సమాజం కోసం కష్ట పడిన వ్యక్తీ మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ బాబు చెప్పారు.శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని పి.జి.ఆర్.యస్ సమావేశ మందిరములో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆద్వర్యములో మహాత్మా జ్యోతీ రావు పూలే 199 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక శాసన సభ్యులు డా. చదలవాడ అరవింద బాబు తో కలసి మహాత్మా జ్యోతీ రావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళీలు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతీ రావు పూలే జీవిత చరిత్ర , పోరాటాలు, లక్ష్యాలు అందరూ తెలుసుకోవాలన్నారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అసమానతలు రూపు మాపెందుకు కంకణం కట్టుకున్నారన్నారు. మహిళలు చదువు లేకపోవడం వలన గుర్తింపు పొందడం లేదని గుర్తించి తన జీవిత భాస్వామిని ఉపాధ్యాయురాలుగా తీర్చి దిద్ది సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. సమాజం కోసం తీవ్రంగా కష్ట పడిన వ్యక్తి అని కొనియాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశారన్నారు. బాలికా విద్యను ప్రోత్సాహించారన్నారు. బి.సి. కార్పోరేషన్ ఆద్వర్యములో రానున్న ఆర్ధిక (2024-25) సంవత్సరానికి 2107 మందికి సుమారు 51 కోట్ల రూపాయలు సబ్సీడితో రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా బి.సి లకు 1136 మందికి 22 కోలా 99 లక్షల రూపాయలు, కాపు కులానికి సంబంధించి 461 మందికి 15 కోట్ల 48 లక్షలు, ఈ.బి.సి లు 63 మందికి 1 కోటి 66 లక్షలు, కమ్మకులానికి సంబంధించి 2౦4 మందికి 5 కోట్ల 35 లక్షలు, రెడ్డి కులానికి సంబందించి 142 మందికి 3 కోట్ల 71 లక్షలు,ఆర్య వైశ్యులు 66 మందికి 1 కోటి 71 లక్షలు, క్షత్రియ కులానికి సంబంధించి 3 రికి 7 లక్షలు, బ్రాహ్మిన్ కులానికి సంబంధించి 32 మందికి 93 లక్షలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరసరావుపేట శాసన సభ్యులు డా. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ మహాత్మా జ్యోతీ రావు పూలే 199 వ జయంతిని ప్రభుత్వ పండుగా గా నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. మహాత్ముల జీవిత చరిత్రలు , బయో గ్రఫీలు అనందరూ చదివి స్ఫూర్తి పొందాలన్నారు. అన్ని వర్గాలను ఆదుకోవడం ప్రభుత్వము కట్టుబడి ఉన్నదని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు సుమారు 400 మందికి 50% సబ్సీడితో బి.సి కార్పోరేషన్ సుమారు 13 కోట్ల రూపాయలు అందించడం జరుగుతున్నదన్నారు. కార్యక్రమ అనంతరం లబ్ది దారులకు మెగా చెక్కును అందచేసారు. ఈ కార్యక్రమములో జిల్లా రెవిన్యూ అధికారి మురళి, రెవిన్యూ డివిజినల్ అధికారి మధులత, వెనుకబడిన తరగతుల శాఖాధికారి శివ నాగేశ్వర రావు, వివిధ సంఘాల నాయకులు మల్లిఖార్జున రావు, చంద్ర శేఖర్, నరసింహ రావు,షేక్ మాబు, శ్రీను. సి.హెచ్ బాలు, నాగ జ్యోతి, పూర్ణ చంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత పల్నాడు బస్టాండ్ వద్డ ఉన్న మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,స్థానిక శాసన సబ్యులు డా. చదలవాడ అరవింద బాబుతో కలసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.