నారద వర్తమాన సమాచారం
ఆచరించేది ఇతర మతం.. అపనిందలు, అసత్యప్రచారం మాత్రం టీటీడీపైనా? : మాజీమంత్రి ప్రత్తిపాటి
తాడేపల్లి ఆదేశాలతోనే నాస్తికుడైన భూమనకు ఉన్నపళంగా టీటీడీపై, గోవులపై ప్రేమ ఉప్పొంగింది : ప్రత్తిపాటి.
పవిత్రమైన టీటీడీని తమస్వార్థ రాజకీయాలకు బలిచేసి, ప్రశాంతమైన రాష్ట్రంలో విధ్వంసరచన చేయాలన్నదే జగన్ .. వైసీపీనేతల పన్నాగం : ప్రత్తిపాటి
ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలతో టీటీడీని, హింధూధర్మాన్ని అన్యమతస్తుడైన భూమన కరుణాకర్ రెడ్డి బదనాం చేస్తున్నాడని, తాడేపల్లి ఆదేశాలతోనే నాస్తికుడైన భూమనలో ఉన్నపళంగా టీటీడీప్రతిష్టపై, గోవులపై వాత్సల్యం, ప్రేమ ఉప్పొంగాయని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. నిన్నటివరకు తమస్వార్థ రాజకీయాల కోసం శవాల్ని వెతుకున్న వైసీపీనేతలు, నేడు హిందూధర్మంపై విషంకక్కేందుకు, రాష్ట్రంలో విధ్వేషాలు రేపేందుకు గోమరణాల్ని రాజకీయం చేస్తున్నారని ప్రత్తిపాటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
“ పరమ పవిత్రమైన తిరుమల లడ్డూని మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఓట్లకోసం పంచిపెట్టినప్పుడు భూమనకు టీటీడీ ప్రతిష్ట గుర్తురాలేదా? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉద్దేశించి… వేంకటేశ్వరుడు కేవలం నల్లరాయి.. దాన్ని పెకిలించివేస్తే మాత్రం తప్పేమిటని తూలనాడిన భూమన, నేడు జరగని దాన్ని జరిగినట్టుగా ప్రచారంచేస్తూ గోమరణాలతో లబ్ధి పొందే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు కాదా? అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో రథాలు తగలబడ్డా, విగ్రహాలు నరికివేయబడ్డా, ఆలయాలు కూల్చబడ్డా ఆఖరికి సాదాసీదా గుడులు మొదలు, ప్రసిద్ధ క్షేత్రాల్లో నిధులు సొంతపార్టీవారే స్వాహా చేసినా తెరవని నోళ్లు నేడు మత విద్వేషాలకోసం ఆవురవురంటూ తెరుచుకోవడం స్వార్థ, విద్వేష రాజకీయ రగడం కోసం కాదా? భూమన, ఆయన కుటుంబం ఆచరించేది, విశ్వసించేది ఇతర మతం.. మరి ఆపనిందలు, అసత్యప్రచారం టీటీడీపై, హిందూధర్మంపై ఎందుకు భూమనా? తనకుమార్తె నీహారెడ్డి పెళ్లిని ఇతర మత పద్ధతిలో భూమన జరిపించింది వాస్తవం కాదా? తన అవినీతి, అక్రమార్జన కోసం ఛైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీ సొమ్మును భూమన దారిమళ్లించలేదా? తాను ఛైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల కొండపై అన్యమతప్రచారాన్ని ప్రోత్సహించలేదా? ఏడు కొండలను, 5 కొండలుగా మార్చే కుట్రలకు తెరలేపింది భూమన కాదా? తాను చేసిన తప్పుల్ని, అపచారాల్ని కప్పిపుచ్చుకోవడానికి, తనమనిషి హరినాథ్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే భూమన పనిగట్టుకొని మరీ తిరుమలపై, గోశాలపై విషం చిమ్ముతున్నాడనేది కాదనలేని సత్యం. టీటీడీ గోశాలకు నిత్యం వచ్చే వేలాది భక్తులకు కనిపించని గోమరణాలు భూమనకే కనిపించడం జగన్మాయ కాదా? టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోయాయనే భూమన, వైసీపీనేతల ప్రచారమంతా అసత్యం…అభూతకల్పనే. ఎక్కడో మరణించిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలవని నమ్మించేందుకు భూమన చేస్తున్న ప్రయత్నాలు చిన్నపిల్లల కుప్పిగంతుల్ని తలపిస్తున్నాయి. నిన్నటివరకు శవాలతో రాజకీయం చేసిన వైసీపీనేతలు… ఇప్పుడు పవిత్రమైన గోవుని వాడుకుంటున్నారు. పవిత్రమైన టీటీడీని తమస్వార్థ రాజకీయాలకు బలిచేసి, ప్రశాంతమైన రాష్ట్రంలో విధ్వంసరచన చేయాలన్నదే జగన్ .. వైసీపీనేతల పన్నాగం.” అని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.