జగన్ కాపాడకుంటే పిన్నెల్లి పాపాల పుట్ట ఎప్పుడో పగిలేది: ప్రత్తిపాటి
రౌడీలకు రోజులు చెల్లాయనడానికి పిన్నెల్లి అరెస్టే సంకేతం: ప్రత్తిపాటి
పల్నాడులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెంచి పోషించింది, ఇంతకాలం కాపాడింది మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డే అన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారడంతోనే రాష్ట్రంలో రౌడీమూకలకు కాలం చెల్లిందనడానికి పిన్నెల్లి అరెస్టుతో సరైన సంకేతం పంపినట్లైందన్నారాయన. ప్రజలందర్నీ భయం గుప్పిట్లోకి నెట్టి, ఆ భయమే పెట్టుబడిగా వేలకోట్లు సంపాదించుకుని, ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వారి రక్తం కళ్లచూసినా రాక్షసుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అని ధ్వజమెత్తారు ప్రత్తిపాటి. మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలను చూస్తున్న తనకే గత అయిదేళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న దారుణ పరిస్థితులు భీతి కలిగించాయన్నారు. అంతగా నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించిన ప్రజాప్రతినిధిని చరిత్రలో చూడలేదన్నారు ప్రత్తిపాటి. శుక్రవారం చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి నిర్మించిన నేరసామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఇక సమయం ఆసన్నమైందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు దెబ్బతో పల్నాడు ప్రాంత వైకాపా నేతలతో పాటు ఇంతకాలం జగన్ అండ తో చెలరేగిపోయిన రౌడీలందర్నీ వణుకు మొదలైందన్నారు ప్రత్తిపాటి. వెయ్యి గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానతో కొట్టుకుని పోక తప్పదని, అలానే ప్రభంజనం లాంటి విజయంతో రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వంతో పిన్నెల్లి మాఫియా ఆటకట్టిందని ఆయన చుర కలు వేశారు. పరారీలో ఉన్న పిన్నెల్లి సోదరు వెంకటరామిరెడ్డి, వాళ్ల చేతుల్లో ఆయుధాల్లా పని చేసిన చేసిన తురకా కిషోర్ ముఠానూ సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని, పల్నాడులో పూర్తి స్థాయి ప్రశాంత పరిస్థితులు నెలకొల్పడంతో అదే కీలకమని ప్రత్తిపాటి సూచించారు. నిజానికి పిన్నెల్లి అయిదేళ్లుగా ఎన్నో నేరాలు, ఘోరాలు చేసినా బీసీ నాయకుడు తోట చంద్రయ్య హత్య రోజు నుంచే పిన్నెల్లి రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు ప్రత్తిపాటి. అసలు ఇలాంటివ్యక్తికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండడానికే ఏమాత్రం అర్హతలేదన్నారు. బాధితులపైనే ఎదురుకేసులు పెట్టించి దోచుకున్న పిన్నెల్లి ముఠా వేళ్లు కత్తిరింపుతోనే ప్రశాంత పల్నాడు సాధ్యమని, ఇంతకా లం అతడి దురాగతాలకు అండగా నిలిచిన పోలీసు సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు ఉన్నతాధికారులను కోరారు ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.