నారద వర్తమాన సమాచారం
ప్రకృతి సాగుదారులందరికీ సాగు నీటి వసతి కల్పించాలి.
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి.
సాగు చేసే రైతులకు గోకులం షెడ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి.
ది.24.04.2025. కూనవరం మండలం కూటూరు.
ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారత సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది వారి ఆధ్వర్యంలో కూ టూరు గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పాయం సీతారామయ్య మాట్లాడుతూ .
ప్రకృతి వ్యవసాయo గురించి ప్రభుత్వం ప్రచారం ఆర్భాటం తప్ప రైతుకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో లోపాలు ఉన్నాయి అని అన్నారు.
ప్రకృతి వ్యవసాయo చెయ్యడానికి ముందుకొస్తున్న ప్రతి రైతుకు మినిగోకులం షెడ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి.
ప్రతి గ్రామంలో సాగు భూమిలో భూసార పరీక్షలు నిర్వహించే టట్లు చర్యలు తీసుకోవాలి.
సాగు నీటి సదుపాయం లేని రైతు భూములకు సాగునీటి సదుపాయం ,సోలార్ బోర్లు కల్పించాలి.
ప్రకృతి వ్యవసాయ పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించాలి.అని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో సిబ్బంది పి.కుమారి,సమ్మయ్య,పార్వతి,రాజు,కుమారి,ప్రభాకర్,కన్నా రావు రైతులు పాయం సీతారామయ్య,శ్రీరాములు, నూప రాజు, శేఖర్,నారాయణ, రత్తయ్య, పెంటయ్య,కారం సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.