నారద వర్తమాన సమాచారం
గ్రామ నిర్మాణాత్మక పురోగతికి మౌలిక వసతుల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది.. “జిల్లా రెవెన్యూ అధికారి మురళి”
గ్రామ నిర్మాణాత్మక పురోగతికి మౌలిక వసతుల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది.. “జిల్లా రెవెన్యూ అధికారి మురళి”గ్రామాలలో నిర్మాణాత్మక పురోగతి, మరియు మౌలిక వసుతల ఏర్పాటుకు పంచాయతీ రాజ్ చట్టం ఎంతో ఉపయోగ పడుతుందని, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ. మురళి అన్నారు. గురురువారం స్థానిక కలెక్టర్ కార్యలయములోని పి.జి.ఆర్.యస్ సమావేశ మందిరములో పంచాయతీ రాజ్ శాఖ ఆద్వర్యములో జాతీయ పంచాయతి రాజ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారి మురళి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో కూడా పంచాయతీ లకు సంబంధించి పిర్యాదులు అందుతున్నాయన్నారు. 73,74 యాక్ట్ ప్రకారం పంచాయతి రాజ శాఖ చాలా పటిష్టంగా ఉందన్నారు. ఇండిపెండెంట్ గా చర్యలు తెసుకొనే శాఖ పంచాయతి రాజ్ శాక అని అన్నారు. గ్రామ పంచాయతిలకు నిధులు అందించడం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ వర్దిల్లాలి అని కొనాయాడారు. జిల్లా పంచాయతి అధికారి భాస్కర రెడ్డి మాట్లాడుతూ 73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్-24 వ తేది పంచాయతీరాజ్ దినముగా జరుపుకోవడం జారుగుతున్నదన్నారు. ఈ సందర్బంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ ప్రాసస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమములో డిప్యూటి కలెక్టర్ శ్రీరాములు,జిల్లా విద్యా శాఖాధికారి చంద్ర కళ, యస్.ఈ. పంచాయతీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.