నారద వర్తమాన సమాచారం
ఉపాధి శ్రామికుల వేతనాలు రూ.300 పైనే అందేలా పనులు చేపట్టండిజిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
జిల్లాలో ఉపాధి హామీ శ్రామికుల సగటు వేతనం రూ.300 పైనే ఉండేలా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రోజుకు 90 వేల శ్రామికులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించగా సగటున 50 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎం లు ఉపాధి కల్పనలో రోజు వారీ లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలన్నారు.
జిల్లాకు మంజూరైన 6500 ఫారం పాండ్లకు గానూ 2,200 ఫారం పాండ్ల నిర్మాణానికి అనుమతులు పొందాల్సి ఉందన్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన 4,341 పాండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.
దాదాపు 12,000 కి.మీ మేరకు కాల్వల పూడిక తీత పనులు, 553 చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణ ప్రియ, డ్వామా పీడీ సిద్ధ లింగ మూర్తి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.