నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్
నరసరావుపేట:-
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశానుసారం, స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, నరసరావుపేట, పల్నాడు జిల్లాలోని డా. కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంబోత్సవానికి నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ యం.ఎల్.ఏ డా. చదలవాడ అరవింద బాబు మరియు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ పి. అరుణ్ బాబు ఐ.ఏ.ఎస్ విచ్చేసి వేసవి క్రీడా శిక్షణా శిబిరాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, జూడో, క్రికెట్ మరియు వాలీబాల్ ఆటలు క్రీడాకారులతో కలసి ఆడటం జరిగింది.
వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ముఖ్య ఉద్దేశం: వివిధ గ్రామీణ & పట్టణ ప్రాంతములో 08 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు వేసవి సెలవుల కాలంలో వారిలో గల క్రీడా ప్రతిభను వెలికితీయుటకు గాను ప్రతి సంవత్సరం మే నెలలో 30 రోజుల పాటు వివిధ క్రీడాంశములలో నైపుణ్యం గల శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు క్రీడా సంఘాల ప్రతినిధులతో అన్ని జిల్లాలో క్రీడా మౌలిక వసతులు గల కేంద్రాలలో వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించబడును.
అందులో బాగంగా పల్నాడు జిల్లాలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో క్రీడా మౌలిక వసతులు కలిగి వున్న 50 కేంద్రాల వద్ద 18 క్రీడాంశములలో
(1) అథ్లెటిక్స్
(2) బ్యాడ్మింటన్
(3) బాల్ బాడ్మింటన్- 1;
(4) బాస్కెట్ బాల్
(5) క్రికెట్-5:
(6) సైక్లింగ్
(7) ఫుట్బాల్
(8)హాకీ
(9) జూడో
(10) కరాటే
(11)కబాడీ
(12) కో కో
(13) స్విమ్మింగ్
(14) టెన్నిస్
(15) వాలీబాల్
(16) రెజ్లింగ్
(17) వూషూ
(18) యోగా
నైపుణ్యం గల శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు క్రీడా సంఘాల ప్రతినిధులతో వేసవి క్రీడా శిక్షణ తరగతులు తేదీ 01.05.2025 2 31.05.2025
పై శిక్షణ తరగతుల ఇన్ చార్జ్ ల ద్వారా ఆయా కేంద్రాల బాలబాలికల వివరాలను శాప్ క్రీడా యప్ నందు అప్లోడ్ చేసి తద్వారా శిక్షణ తరగతులు ముగింపు నాటికి పై శిక్షణ తరగతులలో పాల్గొన్న బాలబాలికలు క్రీడా ధృవీకరణ పత్రాలు పొందగలరని తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో క్రీడా శిక్షకులు, క్రీడాకారులు, సమ్మర్ కోచింగ్ క్యాంపు పి.ఈ.టి లు, పి.డి లు, సీనియర్ క్రీడాకారులు మరియు క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారని జిల్లా క్రీడా అబివృద్ధి అధికారి పి. నరసింహారెడ్డి రెడ్డి తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.