నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు నిన్న అనగా ది.22.04.2025వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ,డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించిన పల్నాడు జిల్లా పోలీసు…
రాత్రి వేళ విస్తృతంగా వాహనాలు తనిఖీలు…
పల్నాడు జిల్లా లోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళ ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు సిబ్బంది విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు,సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో విస్తృతంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై దాడులు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఖాళీ ప్రదేశాలు
శివారు ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాల్లోను, బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు,దాడులు నిర్వహించి 132 కేసులు నమోదు చేసారు.
సాయంత్రం వేళ వాహన తనిఖీలు చేపట్టి పోలీసు అధికారులు, సిబ్బంది రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించి
మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారుల పై కేసులు నమోదు చేసారు.
పల్లె నిద్ర కార్యక్రమం
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వరవకట్ట నందు, ఈపూరు మండలం బొగ్గరం గ్రామం నందు, అచ్చంపేట నందు పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామం నందు, దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం నందు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసు అధికారులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు గ్రామ ప్రజలతో మాట్లాడుతూ…. గ్రామంలో అందరూ ఐకమత్యంతో సోదర భావంతో మెలగాలని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఎవరు నడుచుకోరాదని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని తెలియజేశారు.
ఏదైనా సమస్య ఉన్నట్లయితే సున్నితంగా పరిష్కరించుకోవాలని, లేదంటే పోలీసులను ఆశ్రయించాలని వారు తగిన పరిష్కారం చూపిస్తారని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మోటార్ సైకిల్ పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడపవలెనని, ఎట్టి పరిస్థితుల్లో త్రాగి వాహనములు నడపకూడదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తెలియజేయడం జరిగింది.
సైబర్ క్రైమ్స్ గురించి బ్యాంకు నందు జరిగే మోసాలు గురించి, ఆన్లైన్ మోసాలు గురించి వివరించి ఎవ్వరు వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలియజేయరాదని ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని తెలియజేశారు.
మహిళలపై జరిగే నేరాలు గురించి, బాల్య వివాహాలు గురించి, దొంగతనాల గురించి వివరించి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శక్తి యాప్ గురించి వాటి ప్రయోజనాల గురించి తెలియజేయడం జరిగింది.
కార్డన్ & సెర్చ్
సత్తెనపల్లి పట్టణ పరిధి లోని రంగా కాలనీ నందు కార్డన్ & సెర్చ్.
పల్నాడు జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు గారు సుమారు 100 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి సత్తెనపల్లి టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలోని రంగా కాలనీ పరిసర ప్రాంతాలలో ఈ రోజు ఉదయం 06.00 గంటల నుండి 08.00 కార్దన్ & సెర్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు మాట్లాడుతూ…. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు, క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని, గంజాయి, ఇతర మత్తు పధార్ధాల విక్రయాలు మరియు వినియోగంపై, అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని,
శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, రాత్రి సమయాలలో చిన్న చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలుగా ప్రజల్లో వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రతి రోజూ అన్నీ ముఖ్య ప్రదేశాలలో కార్దన్ & సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగ్తుందని తెలియజేశారు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా సుమారు 30 ద్విచక్ర వాహనాలను సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా, అసత్య ప్రచారాలు నియంత్రించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇకనుంచి తరచుగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ & సెర్చ్ నిర్వహించడంతో
పాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. నేరాలు, ఘర్షణలు నియంత్రణకు పూర్తిస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.