నారద వర్తమాన సమాచారం
వెల్దుర్తి మండలం ఫ్యాక్షన్ గ్రామం అయిన కేపీ గూడెం(కొత్తపుల్లా రెడ్డి గూడెం) నందు కార్డెన్ సెర్చ్
వెల్దుర్తి:-
ఈ రోజు తెల్లవారుజామున పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు వెల్దుర్తి మండలం కేపీ గూడెం(కొత్తపుల్లారెడ్డి గూడెం) గ్రామం నందు ఫ్యాక్షన్ గ్రామ నేపథ్యంలో కార్డెన్ & సెర్చ్ నిర్వహించిన పోలీసులు…
గురజాల ఇంచార్జి డి.ఎస్.పి అయిన సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో గురజాల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల లోని సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలం కేపీ గూడెం లో ఈరోజు ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు…
ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ లేని 25 మోటార్ సైకిల్లు,06 కత్తులు, 08 గొడ్డళ్లు, 12 గడ్డ పలుగులు, 02 బరిసలను పోలీసులు గుర్తించారు …
కేపీ గూడెం గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు డిఎస్పీ హనుమంతరావు తెలిపారు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు డీఎస్పీ హనుమంతరావు మాచర్ల రూరల్ సిఐ నఫీజ్ భాషా కారంపూడి సి.ఐ టీ. వి.శ్రీనివాస రావు వెల్దుర్తి ఎస్ఐ షేక్ సమందర్ వలి, నాగార్జునసాగర్ ఎస్ఐ మహమ్మద్ షఫీ మరియు ఇతర పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.