నారద వర్తమాన సమాచారం
పల్లె నిద్ర చేపట్టిన పల్నాడు జిల్లా పోలీసులు
పల్నాడు జిల్లా..
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు..
సమస్యాత్మకమైన గ్రామాలలో
పల్లె నిద్ర చేపట్టిన పల్నాడు పోలీసులు..
గ్రామస్థులకు అవగాహన సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన పల్నాడు జిల్లా పోలీసులు..
పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు రాత్రి ఫ్యాక్షన్ గ్రామాలలో ఎస్సైలు పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామస్తులతో కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో ఎలాంటి కక్షలు,కార్పన్యాలకు వెళ్ళకూడదని, ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండాలని, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉండాలని,
అందరూ ప్రశాంతమైన వాతావరణం లో జీవించాలని గ్రామస్తులకు తెలియజేశారు.
అదేవిధంగా మాచర్ల రూరల్ పరిధిలోని గన్నవరం గ్రామం,
వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డి గూడెం, అచ్చంపేట మండలం అంబడపుడి గ్రామం,
వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామం, క్రోసూరు గ్రామం నందు మరియు రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామం నందు సిఐ లు మరియు ఎస్సై లు పల్లెనిద్ర చేపట్టి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్సై లు మరియు సిఐలు పర్యటించి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి. ఫ్యాక్షన్ గొడవల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని అటువంటి వాటికి స్వస్తి పలకాలన్నారు.
ఫ్యాక్షన్ గ్రామాలలో పోలీస్ అధికారులు పర్యటించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.