నారద వర్తమాన సమాచారం
కార్మికులే టార్గెట్ గా గంజాయి విక్రయాలు…!
షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు
పోలీసుల అదుపులో గంజాయి విక్రయ నిర్వాహకుడు
ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కిన గంజాయి చాక్లెట్లు
గంజాయి విలువ 3.5 లక్షలు
షాద్ నగర్ మీడియా సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఉజ్వల రెడ్డి వెల్లడి
వలస కార్మికులే టార్గెట్ గా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని గంజాయి కి బానిసలను చేస్తూ పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడానికి వచ్చిన వ్యక్తులకు ఇబ్బడి ముబ్బడిగా గంజాయి అమ్ముతున్న అక్రమ వ్యాపారిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి లక్షలాది రూపాయల విలువైన గంజాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి ఉజ్వల రెడ్డి వివరించారు. షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసు శాఖా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఉజ్వల రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులుగా నివసిస్తున్న వారికి గంజాయి వికరించేందుకు నందిగామ సమీపంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద ఒక చిన్న హోటల్ మరియు కిరాణం వ్యాపారం నిర్వహిస్తూ బీహార్ రాష్ట్రానికి చెందిన పింటూ సింగ్ అనే వ్యక్తి ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల నుండి గంజాయిని తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా పలు కంపెనీలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు వాటిని అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజులు పాటు నిఘా ఉంచి శనివారం సదరు వ్యక్తిని పట్టుకొని నిందితుని వద్ద 2.250 కిలో గ్రాముల ఎండు గంజాయి, 9.13 కిలోగ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయి మరియు గంజాయి చాక్లెట్ల విలువ సుమారు 3.5 లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. అరెస్టు చేసిన నిందితుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఎక్సైజ్ దాడుల్లో నందిగామ ఏరియా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సునీత, షాద్ నగర్ ఏరియా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, ఎక్సైజ్ పోలీసులు రవి, సుధీర్, వినోద్, రాజయ్య, రోహిత్ తదితరులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.