నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
నరసరావు పేట.
నరసరావుపేట నందు పర్యటించిన డైరెక్టర్ ఆకె.రవికృష్ణ ఐపీఎస్ పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఈగల్ టీం డైరెక్టర్ ఆకె.రవికృష్ణ ఐపీఎస్
ఈగల్ టీం డైరెక్టర్ గా నియమితులైన తరువాత మొదటిసారిగా పల్నాడు జిల్లా నరసరావు పేట కు విచ్చేసిన ఆకె.రవి కృష్ణ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ పుష్పగుచ్చం అందించినారు
పల్నాడు జిల్లా నందు గంజాయి నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై పల్నాడు జిల్లా కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తో చర్చించిన అనంతరం నరసరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.
ది.02/12/2024 వ తేదీ సోమవారం రోజున నరసరావుపేటలో 400 గంజాయి చాక్లెట్లు పట్టుకున్న నేపథ్యం లో గంజాయి నిర్మూలనకు తీసుకొనవలసిన చర్యల పై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఐపిఎస్ మరియు ఎక్సైజ్ అధికారులతో ఎక్సైజ్ పోలీసు స్టేషన్ నందు ప్రత్యేకంగా భేటి అయ్యారు.
ఏపీ ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే. రవికృష్ణ ఐపీఎస్ మాట్లాడుతూ
గంజాయి
నిర్మూలనకు ప్రభుత్వం “ఈగల్”(ఎలైట్ ఆంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్) అనే ఒక వ్యవస్థను తెచ్చింది అని
గంజాయి,డ్రగ్స్ సమూల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుoటున్నాం.
రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే 1972కి ప్రజలు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని తెలిపారు.
మాధకద్రవ్యాలు అమ్మినా,కలిగి ఉన్నా చట్ట రీత్యా నేరం అని తెలిపారు.
ఏపీ ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ ఐపీఎస్ వెంట,ఈగల్ టీమ్ ఎస్పి నగేష్ ఐపీఎస్ , పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.