నారద వర్తమాన సమాచారం
బంగారు కుటుంబాల అభివృద్ధే పి.4 లక్ష్యం : పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
పల్నాడు జిల్లాలో వేగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక
పల్నాడు జిల్లా లోని నరసరావు పేట మండలం, దొండపాడు గ్రామం పరిధిలో గురువారం పి.4 సర్వే బంగారు కుటుంబాల వెరిఫికేషన్ కోసం గ్రామ సభ ఏర్పాటు చేశారు.
ఈ సభకు ముఖ్య అతిథి గా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు హాజరయ్యారు.
గ్రామంలో ఇప్పటికే సచివాలయ సిబ్బంది పీ4 సర్వే పూర్తి చేసి 139 బంగారు కుటుంబాలను గుర్తించారని, మార్పులు, చేర్పుల కోసం గ్రామ సభ నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 64 వేల మందిని గుర్తించి నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు.
2047 నాటికి జిల్లాలో ఎక్కడ ఒక్క కుటుంబం కూడా పేదరికంతో బాధ పడకుండా చూడాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వం, ప్రజలు,ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు,ఉద్యోగులు, విదేశాలలో ఉండే వారిని ప్రతి ఒక్కరిని సమన్వయ పరిచి మార్గదర్శకులుగా ఎంపిక చేయడం జరుగుతుంద న్నారు.
సమాజంలో ఉన్న పేదవారిని గుర్తించి, వారిలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, మార్గదర్శకులుగా పిలవబడిన వారు వీరిని ఎంపిక చేసుకుని వారి కుటుంబాలను ఏదో ఒక సాయం చేయడం, లేదా చేయించడం దీని లక్ష్యం అని తెలిపారు.
పేదరికం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా మార్గదర్శకులు పనిచేయాలని,ఆ ఊరి లోని పేదవారిని, ఆ ఊరు పెద్దలు ఆదుకొనడం, వారికి సాయం చేయడం, వారికి సాయం అందించడం వంటివి చేసినప్పుడే పేదరికం పోతుందని దానికి అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత,ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ ఆ ఊరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.