నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ – గుంటూరు నగర నూతన కార్యవర్గం ఎన్నిక.
ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ప్రమాణ స్వీకారం.
గుంటూరు: జూలై 25
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ గుంటూరు నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం శుక్రవారం స్థానిక ఏపీ ఎన్జీవో హోం నందు ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి గుంటూరు బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బోస్క సువర్ణ బాబు ,ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రెటరీ పట్నాల సాయికుమార్, గుంటూరు జిల్లా సలహాదారు రాజా,తెనాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు శ్యాంసుందర్, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని రానున్న రోజుల్లో ఫెడరేషన్ అభివృద్ధికి తోడ్పాటున అందిస్తూ జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కారం చేయటంతో పాటు వారి అభివృద్ధి అభ్యున్నతికి తోడ్పాటు అందించే విధంగా ఐక్యతతో అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.నూతన కమిటీ సభ్యులుగా నగర అధ్యక్షులుగా బలగాం ప్రమోద్ కిరణ్ , ప్రధాన కార్యదర్శిగా మెట్ట షణ్ముఖ కోశాధికారిగా అంగిరేకుల గోపి,గౌరవ అధ్యక్షులుగా కంచర్ల నాగరాజు,కార్యనిర్వాహక కార్యదర్శిగా మేకల లక్ష్మణ్,ఉపాధ్యక్షులుగా బుడ్డుల జోసఫ్ ప్రసాద్, కార్యదర్శిగా కోట సిద్దు, ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి పలువురు అభినందనలు తెలియజేస్తూ ఆత్మీయ సత్కారం అందించారు. ఈ సందర్భంగా నూతన నగర కమిటీ అధ్యక్షులు బలగం ప్రమోద్ కిరణ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఫెడరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేస్తామని తెలియజేశారు.తనకు ఈ పదవి అందించినా జిల్లా మరియు రాష్ట్ర కమిటీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు జహీర్,మహేష్,మణి సాగర్, ఆరుద్ర,శ్యాముల్,శివ, పొనుగుభాటి నాగరాజు,సువర్ణ రాజు,బ్రహ్మం,రవి,మురళి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.