నారద వర్తమాన సమాచారం
పల్నాడులో పర్యటించిన డి పి టి ఓ అజిత కుమారి
ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి అజిత కుమారి పల్నాడులో పర్యటించారు. దీనిలో భాగంగా గురజాల బస్ స్టేషన్ ను సిబ్బందితో ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ ప్రాంగణం పరిసరాలు,ప్రయాణికుల ప్రవేశ మార్గం పరిశీలించారు. ప్రయాణికులు టాయిలెట్లు గదులను, పార్సిల్ పనితీరు, మంచినీటి వసతి గురించి ఆరా తీశారు. బస్ స్టేషన్ లో పై భాగంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మెట్ల వద్ద గేటు ఏర్పాటు చేయాలని కంట్రోలర్ వివరించారు.బస్ స్టేషన్ ముందు భాగంలో స్వాగతం తెలుపుతూ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రాంగణం పరిసరాలను శుభ్రతగా తెలిపారు. బస్ స్టేషన్ లో ఇరువురు కంట్రోలర్స్ విధుల గురించి డి పి టి ఓ తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అనంతరం మాచర్ల ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోను ఆమె పరిశీలించి ప్రయాణికుల నుండి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపో పరిధి యూనియన్ లు డి పి టి ఓ అజిత కుమారి ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.