ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
నారద వర్తమాన సమాచారం
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 96 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన సిరికొండ నాగలక్ష్మి అను ఆమెకు విశాఖపట్నం లోని కంచరపాలెం నకు చెందిన మిడిదొడ్డి కిషోర్ కుమార్ తో 2020 వ సంవత్సరంలో వివాహం అయినట్లు, వివాహం అయిన రెండవ సంవత్సరం నుండి ఫిర్యాది భర్త ఎదురింటి నిరోషాతో అక్రమ సంబంధం పెట్టుకొని కలిసి జీవిస్తున్నట్లు, దీనిని గమనించిన ఫిర్యాది నిరోషాను తన భర్తను అడగగా ఫిర్యాదిని నానా విధాలుగా హింసించి, ఫిర్యాదిని మరియు వారి సంతానం అయిన చిన్న పిల్లవాడిని ఇంట్లో ఉంచి తాళం వేసి ఫిర్యాది అత్తమామలు మరియు భర్త పనులకు వెళ్లేవారు. రెండు సంవత్సరాల పాటు ఫిర్యాదిని కానీ పిల్లవాడిని కానీ బయటకు రానివ్వక ఇంటిలోనే నానా రకాలుగా కొట్టడం వివిధ రకాలుగా దూషించడం చేసేవారు. ఇది భరించలేక ఫిర్యాది తన పుట్టింటికీ దేచవరం గ్రామం పారిపోయి వచ్చినట్లు, ఫిర్యాది వచ్చేటప్పుడు తన కుమారుడైన రోహన్ష్ ను ఫిర్యాది భర్త బలవంతంగా ఫిర్యాది వద్ద నుండి లాగుకొని తన్ని పంపినట్లు, కావున తన భర్త వద్ద నుండి తన బిడ్డను ఇప్పించి తగిన న్యాయం చేయవలసినదిగా ఈ రోజు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన షేక్ ఆదం వలి అను అతనికి ట్రావెల్స్ లో పనిచేసే సమయంలో సొలస గ్రామస్తుడు అయిన బొక్క మరియదాసు పరిచయమైనట్లు, ఆ పరిచయం మీద బొక్క మరియదాసు ట్రావెల్స్ లో బస్సు కొనుగోలు చేయుటకు 4,20,000/- తగ్గినవి ఎవరివద్దనైనా ఇప్పించమని
ఫిర్యాదినీ బతిమిలాడగా ఫిర్యాది పమిడిపాడు గ్రామానికి చెందిన షేక్ దరియావలి వద్ద 2016వ సంవత్సరంలో 4,20,000/- రూపాయలు ఇప్పించినట్లు, ఆ తదుపరి సదరు ట్రావెల్స్ లో బస్సును నడుపుతూ నెలకు 8400/- రూపాయలు రెండు సంవత్సరాలు వడ్డీ కట్టినట్లు, తదుపరి కరోనా కారణంగా ట్రావెల్స్ ఆగిపోవడంతో వడ్డీ చెల్లించలేకపోయినట్లు, ఆ తదుపరి బొక్క మరియదాసు నేను అప్పు కట్టలేదని తెగ వేసి చెప్పినందుకు సదరు దరియావలి నాకు సంబంధం లేదు. నేను నిన్ను చూసి ఇచ్చాను అని ఫిర్యాది చేత ప్రోనోటు 2019 సంవత్సరంలో
వ్రాయించుకున్నట్లు, ఆ తదుపరి ఫిర్యాది తన వద్ద ఉన్న కారును అమ్మి 5,00,000/- రూపాయలు ఫైనల్ సెటిల్మెంట్ కింద ఇచ్చినట్లు, ఆ తదుపరి ప్రోనోటు ఇవ్వమని అడగగా లెక్క చూసి ఇస్తానని చెప్పి ఇప్పుడు నువ్వు కట్టిన 5 లక్షల రూపాయలు వడ్డీకి సరిపోతుంది ఇంకా 8లక్షలు ఇవ్వాలని చెప్పి అక్రమంగా ఫిర్యాది స్థలములో బర్రెలను కట్టివేసి నా కొడకా నీవు మర్యాదగా 8లక్షలు ఇస్తేనే నీ స్థలమును కాళీ చేస్తాను లేకపోతే చేయను, మీకు చేతనైనది చేసుకోమని బెదిరిస్తున్నందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
సత్తెనపల్లి పట్టణానికి చెందినటువంటి కోరప్రోలు లక్ష్మీ వెంకట నరసింహ గుప్త అను అతను వినాయక కమ్యూనికేషన్స్ అను వ్యాపారం పెట్టుకొని సెల్ ఫోన్ వ్యాపారం చేయుచున్నట్లు, అదే పట్టణానికి చెందినటువంటి పవన్ మొబైల్ ప్లానెట్ అను అతను మొబైల్ ఫోన్స్ వ్యాపారం చేస్తున్నట్లు, అతనికి ఫిర్యాది ఫోన్లు అప్పుగా ఇస్తున్నట్లు, సత్తెనపల్లికి చెందిన కార్తికేయ కమ్యూనికేషన్స్ కు చెందిన తొమండ్రు ప్రసాద్ అను అతను కూడా సెల్ ఫోన్ వ్యాపారం చేస్తున్నట్లు, ఈ క్రమంలో వివిధ దఫాలుగా ఫిర్యాది పవన్ మొబైల్స్ బచ్చు పూర్ణ పవన్ నాగసాయి శేఖర్ అను అతనికి 28,75,983/- లు మరియు కార్తికేయ కమ్యూనికేషన్స్ అను అతనికి సుమారు 25,00,000/- రూపాయలు ఫిర్యాదుకి అప్పు పడినట్లు, సుమారు ఒక సంవత్సరం నుండి బాకీ చెల్లించకుండా అనేక సార్లు ఇబ్బంది పెడుతున్నట్లు, ఫిర్యాదు డబ్బులను ఇవ్వమని అడగగా రేపు మాపు అంటూ నమ్మించి మోసం చేస్తున్నట్లు, ఒక్కొక్కసారి ఇద్దరూ కలిసి చంపుతామని బెదిరిస్తున్నందుకుగాను
ఈ రోజు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందినటువంటి తీర్ధాల రాజ్యమ్మ అను ఆమె శ్రీ ప్రసన్నాంజనేయ డ్వాక్రా గ్రూపు నందు రెండవ లీడర్ గా ఉన్నట్లు, డ్వాక్రా లోను పదిమందికి కలిపి 8,30,000/- రూపాయలు తీసుకున్నట్లు, ఆ సమయంలో గ్రూపులో వారు అందరూ కలిసి ముందు జాగ్రత్తగా ఎవరైనా డబ్బులు కట్టకుండా ఇబ్బంది పెడతారనే ఆలోచనతో తనతో పాటు ప్రతి ఒక్కరూ ఖాళీ నోట్ల మీద సంతకాలు చేసి గ్రూపు మొదటి లీడర్ అయిన చిల్లా పుష్పలత అను ఆమె వద్ద నోట్లు పెట్టినట్లు, లోన్ అంతా తీర్చిన తర్వాత ఆంధ్ర బ్యాంకు మాచర్ల నందు ఉన్న డ్వాక్రా లోన్ అయిపోయినది అని బ్యాంకు వారు చెప్పిన తర్వాత ఎవరి నోట్లు వాళ్ళకి తిరిగి చిల్లా పుష్పలత ఇచ్చినట్లు, కానీ ఫిర్యాది ఖాళీ నోటు మాత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, అదేమని అడిగితే మీ అబ్బాయి మాకు అమౌంట్ ఇవ్వాలి అని అందుకే నీవు చెల్లించు అని ఫిర్యాదిని బెదిరిస్తున్నట్లు, ఫిర్యాది కుమారుడు అయిన తీర్థాల లింగయ్య ఐదు నెలల క్రితం వ్యవసాయ ఖర్చుల నిమిత్తం కొంత అప్పు చేసుకుని పంటలు పండక ఇబ్బంది పడుతూ అప్పుల బాధతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు, డ్వాక్రా కింద తీసుకున్న లోన్ తాలూకా అమౌంట్ అంతయు చెల్లించినందున ఖాళీ నోటు ఇప్పించవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
రాజుపాలెం మండలం చౌటపప్పాయపాలెం గ్రామానికి చెందిన మత్తమ్మ మరియు తొమ్మిది మంది మహిళలు కలిసి రాజీవ్ మహిళా పొదుపు గ్రూపు నందు సభ్యులుగా ఉన్నట్లు, వీరు స్త్రీ నిధి లోన్ క్రింద 2,50,000/- రూపాయలు మరియు బ్యాంకు ద్వారా తీసుకున్న 5 లక్షల రూపాయలు ప్రతినెల కిస్తీల రూపంలో గ్రూపు సెకండ్ లీడర్ అయిన ప్రమీల రాణి కి 19 నెలల నుండి చెల్లిస్తున్నట్లు, అయితే సదరు బ్యాంకుకు వెళ్లి గ్రూపులోని సభ్యులు మేనేజర్ ని సంప్రదించగా 19 నెలల నుండి లోన్ డబ్బులు రూపాయి కూడా చెల్లించలేదని తెలిపినట్లు, అంతట గ్రూపు సభ్యులు రెండవ లీడర్ అయిన ప్రమీల రాణిని ఇంటి వద్దకు వెళ్లి అడుగగా సదరు ప్రమీల రాణి మరియు ఆమె భర్త అయిన నాగరాజు ఇరువురు నోటికి పట్టరాని విధంగా బూతులు తిట్టినట్లు, మేము లోన్ డబ్బులు కట్టము మీకు చేతనైంది చేసుకోండి, మీకు దిక్కున చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నట్లు,కావున గ్రూపులో ఉన్నటువంటి సభ్యులను మోసగించి డబ్బులు వసూలు చేసుకొని తమ స్వంతానికి వాడుకున్నందుకు గాను వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.
అదే విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల కొరకు భోజన ఏర్పాట్లు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.