నారద వర్తమాన సమాచారం
కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన హోంగార్డ్స్ ను శాలువా తో సత్కరించి అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్
పల్నాడు జిల్లా పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో విజయం సాధించిన ముగ్గురికి సివిల్ విభాగం లో కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించగా వారిని బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు,ఐపిఎస్., ప్రత్యేకంగా అభినందించారు.
కానిస్టేబుల్స్ గా నియామకం అయినటువంటి హోంగార్డ్స్ వారి వివరాలు :
1.HG.NO : 226
పేరు : P.నగదర్
వర్కింగ్ ప్లేస్ : Deputation Fire Station,Guntur
2.HG.NO : 1281
పేరు : S.వెంకటేశ్వర్లు
వర్కింగ్ ప్లేస్ : పిడుగురాళ్ల PS
3.HG.NO : 1342
పేరు : B.నాసరయ్య
వర్కింగ్ ప్లేస్ : వెల్దుర్తి PS
జిల్లా ఎస్పీ గమాట్లాడుతూ….
కృషి, పట్టుదల, మరియు ఆత్మవిశ్వాసం ద్వారా ఈ విజయాన్ని సాధించగలిగారని ,హోంగార్డ్స్ నుండి కానిస్టేబుల్ స్థాయి సాధించడం తమ తోటి వారికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
హోంగార్డ్స్ గా విధులు నిర్వహిస్తూనే చదువు కొనసాగించడం, పరీక్షల కోసం సన్నద్ధం కావడం సులభమైన విషయం కాదని, అయినా కూడా వారు చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది అని తెలిపారు.
ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఆదర్శాన్ని కొనసాగిస్తూ, నియమ నిబద్ధతలతో ప్రజలకు సేవ చేయాలని తెలిపారు.
అదే విధంగా నేటి పోలీస్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా కీలకం కావడంతో, అందులో నైపుణ్యం పెంచుకోవాలి అని తెలిపారు.
ఇతర హోంగార్డ్స్ కూడా వారి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని, నిరంతరంగా శ్రమించి విజయాన్ని సాధించాలని తెలిపారు.
ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులు, తమకు కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడంలో సహాయపడిన జిల్లా ఎస్పీ కి,హోమ్ గార్డ్ RI S. కృష్ణ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు హోమ్ గార్డ్ RI S.కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.