నారద వర్తమాన సమాచారం
జిల్లాలో 2.26 మీటర్లు పెరిగిన భూగర్భ జల నీటి మట్టంముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో సగటున 2.26 మీటర్ల మేరకు భూగర్భ జల నీటి మట్టం పెరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. భూగర్భ జలం 30 మీటర్ల అడుగున ఉండే బొల్లాపల్లి మండలం, వెల్దుర్తి మండలాల్లో సైతం వరసగా 6 మీ, 3 మీ.లు పెరిగిందని తెలిపారు.
జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఫారం పాండ్ల నిర్మాణాల వల్ల వచ్చే ఏడాది సైతం భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమగ్ర నీటి నిర్వహణలో సాగునీటి సంఘ సభ్యులను, రైతులను భాగస్వాములను చేస్తామని తెలిపారు.
గురువారం మధ్యాహ్నం సాగునీటి సంఘ సభ్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదిహేను రోజుల్లో అన్ని ప్రాజెక్టులకు రిపేర్లు, కాల్వల్లో పూడిక తీత పనులు పూర్తి కావాలని ఆదేశించారు. భూగర్భ జల మట్టం 20 మీటర్లు, 10 మీటర్ల దిగువన ప్రాంతాల్లో జల మట్టం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రీయ బద్ధమైన ప్రణాళిక తయారు చేయాలన్నారు.
కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్ పర్సన్ కాంతారావు, చీఫ్ ఇంజినీర్ బి.శ్యామ్ ప్రసాద్, ఎస్.ఈ కృష్ణ మోహన్, సాగునీటి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.