నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి చంద్రబాబు తెచ్చిన 30 కీలకమైన పథకాలు, సంస్కరణలతో రాష్ట్ర ప్రజలు, మహిళలు ,ఎన్నో సంక్షేమ పథకాలను అందుతున్నాయి : గురజాల శాసనసభ్యులు యరపతినేని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం తొలిసారి సెప్టెంబర్ ఒకటి 1995న ఇదే రోజున సిఎంగా బాధ్యతలు చేపట్టo జరిగింది. ఈ 3 దశాబ్దాల కాలంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలతో రాష్ట్ర ప్రజలు, మహిళలు ,ఎన్నో సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు. దేశంలోనే సంచలనం…ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిన వారిలో మొదటి సీఎంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు. ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి కార్యక్రమంతో ఎన్నో పల్లెలు, పట్టణాల్లో వేలకోట్లతో అభివృద్ధి జరిగింది. ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో పాటు, బాలికా విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. మహిళలకు దీపం పథకం ఏర్పాటు చేశారు. కులవృత్తులకు గౌరవం కల్పించారు. బిసిలకు ఆదరణ పథకం,ఎస్సీల రక్షణ కోసం కమిషన్ సూచనల అమలు చేస్తున్నారు.
బిసిలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు,మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు అందిస్తూ, తొలి సారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటుచేయటం జరిగింది. విద్యుత్ రంగ సంస్కరణల అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం,టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు,పిపిపి విధానంలో నేషనల్ హైవేస్ కు అంకురార్పణ, గ్రామగ్రామాన రోడ్ల నిర్మాణం, ఐటీ కి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. హైటెక్ సిటీ నిర్మాణం,పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ల ఏర్పాటు, విజన్ 2020 తో పాలనకు కొత్త రూపు,విద్యా రంగంలో మార్పులు – 1.80 లక్షల టీచర్ల నియామకం,నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలకటం జరిగింది. స్ధానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్ తో సేవలు సులభతరం చేశారు. డిజిటల్ కరెన్సీ కమిటీ కి నేతృత్వం వహించారు.స్వచ్ఛభారత్ కమిటీకి నేతృత్వం వహించారు. పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ లు, రైతుల కోసం దేశంలో తొలి సారి ఇజ్రాయిల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీతో అన్నదాతకు అండ, రైతులకు సబ్సిడీలు, యాంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.
నదుల అనుసంధానంలో చేయడంలో గటి కృషి చేసి విజయం సాధించారు, అట్టడుగున ఉన్న దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. రియల్ టైం గవర్నెన్స్ – పారదర్శక పాలనను అందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టి ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతి నిర్మాణం చేశారు. పేదరికం నిర్మూలించడం కోసం P4 తో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించారు.ఈ 3 దశాబ్దాల కాలంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలతో రాష్ట్ర ప్రజలు, మహిళలు ,ఎన్నో సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







