నారద వర్తమాన సమాచారం
కట్టుదిట్టమైన భద్రతలో ప్రధాని శ్రీశైలం పర్యటన….
కర్నూలు జిల్లా…
ప్రధాని పర్యటనకు 7,300 మంది పోలీసులతో పకడ్బందీ భద్రత
కట్టుదిట్టమైన భద్రత
భద్రతా ఏర్పాట్ల పై బందోబస్తు నిమిత్తం విచ్చేసిన సెక్టార్ పోలీసు ఉన్నతాధికారులు, లైజనింగ్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన…
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్..
ఈ నెల 16 వ తేదీన కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల గురించి బందోబస్తు నిమిత్తం వచ్చిన సెక్టార్ , లైజనింగ్ పోలీసు అధికారులతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు.
ఈ సంధర్బంగా ఆదివారం కర్నూలు , ఓర్వకల్లు మండలం , నన్నూరు దగ్గర ఉన్న రాగమయూరి గ్రీన్ హిల్స్ లో బహిరంగ సభ ప్రాంతం దగ్గర ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో ప్రధాని పర్యటన ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు.
అనంతరం పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ…
పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్స్ గురించి , జియో గ్రాఫికల్ మ్యాప్ ను చూపిస్తూ మాట్లాడారు.
ప్రధాని పర్యటన నిమిత్తం 7,300 పోలీసు బలగాలను బందోబస్తు కు వినియోగిస్తున్నామన్నారు.
ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
1) ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఏరియాల నుండి వచ్చే వాహనాలను నాగాలాపురం దగ్గర ట్రాఫిక్ మళ్ళింపు చేయాలన్నారు.
బస్తిపాడు, చిన్న టేకూరు , తడకన పల్లి మీదుగా నన్నూరు రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునే విధంగా చేయాలన్నారు.
2) డోన్, ప్యాపిలి, తుగ్గలి, పత్తికోండ ఏరియాల నుండి వచ్చే వాహనాలు నేషనల్ హైవే కు వచ్చి తడకన పల్లి మీదుగా నన్నూరు రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునే విధంగా చేయాలన్నారు.
3) కర్నూలు మీదుగా నుండి వచ్చే వాహనాలు నన్నూరు టోల్ గేట్ దాటి తర్వాత రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునే విధంగా చేయాలన్నారు.
4) నంద్యాల , ఆళ్ళగడ్డ, బనగానపల్లె ఏరియాల నుండి వచ్చే వాహనాలు నంద్యాల రోడ్డు లో వచ్చి రాగమయూరి పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకునే విధంగా చేయాలన్నారు.
ఆయా నియోజక వర్గాల నుండి వచ్చే వాహనాలను ఏవిధంగా పార్కింగ్ ప్రదేశాలకు మళ్ళింపు చేయాలనే విషయాల పై చర్చించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
నియోజక వర్గాల వారిగా కేటాయించిన పార్కింగ్ ఏరియాలలలో వారి వాహనాలను ఏర్పాటు చేసుకునే విధంగా చేయాలన్నారు.
పార్కింగ్ ఏరియాలలో ఇండికేషన్ సైన్ బోర్డ్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆఫీసియల్స్ కి నెంబర్ 2 పార్కింగ్ ఏరియా ను కేటాయించడం జరిగిందన్నారు.
ట్రాఫిక్ డైవర్సన్స్ గురించి, విఐపి కాన్వాయ్ రూట్ , ఏయే నియోజక వర్గాల నుండి ఎంత మంది ప్రజలు వస్తున్నారని, క్రౌడ్ కంట్రోల్ ఏవిధంగా చేయాలనే విషయాల గురించి బందోబస్తు వివరాల గురించి, జియోగ్రాఫికల్ మ్యాప్ ను చూపిస్తూ వివరిస్తూ దిశా నిర్దేశం చేశారు .
ప్రతి సెక్టార్ ఇంచార్జ్ పోలీసు ఉన్నతాధికారులకు, లైజనింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.
వివిఐపిల పార్కింగ్, వివి ఐపిల గ్యాలరీల దగ్గర అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో ఆయా జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, దేవరాజ్, మాధవ్ రెడ్డి, దీపికా పాటిల్, జి. కృష్ణకాంత్, కృష్ణకాంత్ పటేల్,శ్రీనివాసరావు, మణికంఠ చందవోలు, దీరజ్ కునుబిల్లి, షెల్కే నచికేత్ విశ్వనాథ్, చక్రవర్తి, లక్ష్మీనారాయణ, ట్రైనీ ఐపియస్ లు, అడిషనల్ ఎస్పీలు , డిఎస్పీలు, సిఐలు, ఆర్ ఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.