నారద వర్తమాన సమాచారం
శాంతి భద్రతల పరిరక్షణ,అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు….
పల్నాడు : నరసరావుపేట
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు చిలకలూరి పేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని టిడ్కో గృహాల కాలనీ నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
52 ఎకరాల టిడ్కో గృహాల కాలనీలో పోలీసులు ఈరోజు తెల్లవారుజామున విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ప్రతి ఇంటిలో ఎవరు నివసిస్తున్నారు అనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా వివరాలు సేకరించారు.
ఈ తనిఖీ లలో గ్రామంలో సరైన పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు,1 ఆటో,3 గొడ్డళ్లు, 1 కత్తి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
టిడ్కో గృహాలలో నివసించే వారికి సమావేశం నిర్వహించి ప్రస్తుత సమాజంలో జరుగుచున్న ఆర్థిక మోసాలపై, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
అంతేకాకుండా..రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అక్రమ మద్యం,గంజాయి,డ్రగ్స్ వంటి నిషేధిత ఉత్పత్తులు నిల్వ చేసినా,స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో
సత్తెనపల్లి డి.ఎస్పి ఎమ్. హనుమంతరావు,
చిలకలూరి పేట టౌన్ సిఐ పి.రమేష్ ,
చిలకలూరి పేట రూరల్ సర్కిల్ సీఐ బి.సుబ్బ నాయుడు,నరసరావుపేట 1 వ పట్టణ సీఐ ఫిరోజ్
నరసరావుపేట రూరల్ సిఐ పి.రామకృష్ణ ఎస్సైలు మరియు సిబ్బంది సుమారు 100 మంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.

 
                                    





