Friday, January 16, 2026

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు , ఐపీఎస్.

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు , ఐపీఎస్.

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.

63 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ను నరసరావు పేట లింగంగుంట్ల లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపిఎస్  ముఖ్య అతిధిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.

కవాతు ప్రదర్శనను వీక్షించిన జిల్లా ఎస్పీ , చక్కటి కవాతు ప్రదర్శన నిర్వహించిన హోంగార్డ్స్‌ ను, పెరేడ్ కమాండర్ సుధాకర్ ని ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…

మన దేశంలో హోం గార్డ్ వ్యవస్థ 1946 సంవత్సరంలో ప్రారంభం అయ్యిందని, ఆ తర్వాత 1963వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్చంధ సేవ చేయు కొరకు పురుడు పోసుకుందని తెలిపారు.

హోంగార్డ్స్ గత 62సం.లుగా పోలీసులతో ఏమాత్రం తీసిపోని విధంగా సేవలు అందిస్తుండటం అభినందనీయం అని తెలిపారు.

శాంతి భద్రతలు కాపాడటంలో, రాత్రి గస్తీ సమయంలో, CCTNS ఆపరేటర్లుగా ఎనలేని కృషి చేస్తున్నారు. కొన్ని సందర్బాలలో పోలీసుల కంటే హోంగార్డ్స్ పని తీరు ఎంతో ప్రశంసించ తగినది.

హోం గార్డ్స్ కవాతు పోలీసుశాఖ క్రమశిక్షణకు మారుపేరని, నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగించాలని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకితభావంతో పని చేయాలన్నారు.

ఎవరికైన ఏదైనా ఉద్యోగ పరమైన సమస్యలు ఉంటే నేరుగా కలవచ్చు అని తెలిపారు.

అనంతరం తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 07 మంది హోం గార్డ్ లకు శ్రీ ఎస్పీ  ప్రశంసా పత్రాలు అందజేసారు.

హోంగార్డ్స్ పోలీసు వారితో సమానంగా ట్రాఫిక్ రెగ్యులేషన్, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని, హోంగార్డ్స్ రాష్ట్రములో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పండుగలు, వి.ఐ.పి. & వి.వి.ఐ.పి. పర్యటనలకు వచ్చు సందర్భములలో వారి యొక్క సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని,వారి కొరకు పల్నాడు పోలీసు శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

పల్నాడు జిల్లా నందు హోంగార్డ్స్ బెనిఫిట్ ఫండ్ ను ఏర్పరచి ఆ ఫండ్ సహాయంతో ఎవరైనా హోంగార్డ్స్ గాయపడిన రూ 20,000, మరణించినా తక్షణ సహాయంగా డబ్బులు అందజేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హోం గార్డ్ యూనిట్ నందు 40 సం.ల పై బడిన వారు ఉన్నారు కావున వారికి ఉచితంగా మెడికల్
టెస్ట్ లు నిర్వహించామని,వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అనంతరం జిల్లా హోంగార్డుల తరఫున  జిల్లా ఎస్పీ కి జ్ఞాపికను అందజేశారు

ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) JV సంతోష్  అడిషనల్ ఎస్పీ (AR) V.సత్తి రాజు అడిషనల్ ఎస్పీ (క్రైమ్) లక్ష్మీపతి  నరసరావు పేట ఇంచార్జ్ డి.ఎస్పీ M.హనుమంతరావు ,ఏ.ఆర్. డి.ఎస్పీ గాంధీ రెడ్డి  హోంగార్డ్ RI S.కృష్ణ ANS RI యువ రాజ్ ,నరసరావు పేట 1వ పట్టణ సి.ఐ SK.T. ఫిరోజ్ నరసరావు పేట 2వ పట్టణ సి.ఐ ప్రభాకర్ పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version