హామీలు నేరవర్చని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఓటుతో బుద్ది చెప్పాలి—
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
నారద వర్తమాన సమాచార
ప్రతినిధి/ శంకర్
గురువారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో అడవిదేవులపల్లి మండలంలో ఉల్సాయిపాలెం, బాల్నేపల్లి, మొల్కచర్ల, బంగారికుంటతండా గ్రామాలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి , ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉల్సాయిపాలెం- టిఆర్ఎస్అభ్యర్ధి ధనావత్ బాలాజీ నాయక్, బాల్నేపల్లి టిఆర్ఎస్ అభ్యర్ధి ముత్యాలి బాలాజీ నాయక్, మొల్కచర్ల- టిఆర్ఎస్ అభ్యర్ధి ముని నాయక్, బంగారికుంటతండా- టిఆర్ఎస్ అభ్యర్ధి కుర్ర శ్రీను నాయక్ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల అభ్యర్ధులతో కలిసి ప్రచారం నిర్వహించి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన అమలు కానీ హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదని అన్నారు.. ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ వారికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పారు.. కావున పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు..
కార్యక్రమంలో ధనావత్ బాలాజీ నాయక్, కుర్ర సేవియా నాయక్, కొత్త మర్రెడ్డి, కుర్ర శ్రీను నాయక్, పెరుమాళ్ళ శ్రీనివాస్, కనిగిరి శ్రీను, స్వామి నాయక్, వర్త్య శివనాయక్, అంచ సాంబశివరావు, లచ్చు నాయక్, భిక్షా నాయక్, రామకోటి నాయక్, మేష్య నాయక్, చిన్న నాయక్ వార్డు మెంబర్లు, గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







