నారద వర్తమాన సమాచారం
నంద్యాల పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్…..
వారి వద్ద నుండి 2.5 K.G ల గంజాయిని,మారుతి షిఫ్ట్ డిజైర్ కారును, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం…..
నంద్యాల సబ్ డివిజన్ ASP నంద్యాల M. జావళి ఆల్ఫోన్స్ IPS
17.12.2025 వ తేదీన మధ్యాహ్నము 01.00 గంటల కాలమపుడు నంద్యాల టౌన్ “Y” జంక్షన్ కు సమీపములో ప్రథమ నంది దేవాలయం ఆర్చ్ వద్ద (ఏ1) షేక్ మునీర్ బాషా 34 సం. తండ్రి హుస్సేన్ బాసా R/o పీర్ల చావిడి వద్ద బసాపురం గ్రామము గాజులపల్లి మండలం నంద్యాల జిల్లా అను అతను అరకు కు చెందిన వ్యక్తి దగ్గర నుండి గంజాయిని కొనుక్కొని తన షిఫ్ట్ డిజైర్ కారులో నంద్యాల కు తీసుకొని వచ్చి తనకు వరుసకు తమ్ముడైన (ఏ2) షేక్ మహబూబ్ బాషా 25 సం. తండ్రి వలి బాష R/o పీర్ల చావిడి వద్ద బసాపురం గ్రామము గాజులపల్లి మండలం నంద్యాల జిల్లా అనునతనికి గంజాయిని ఇస్తూఉండగా రాబడిన ఖచ్చితమైన సమాచారము మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS సూచనలతో నంద్యాల 3 టౌన్ ఇన్స్పెక్టర్ E కంబగిరి రాముడు మరియు అతని సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్ మరియు ఎక్సైజ్ SI వరప్రసాద్ మరియు పంచాయతీదారులతో పాటు అక్కడికి వెళ్ళి సదరు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదముగా గుర్తించి వారిని తనిఖీ చేయగా వారు గంజాయిని అక్రమముగా కలిగి ఉండినారని, గంజాయిని అక్రమముగా రవాణా చేయడము గాని అక్రమముగా కలిగి ఉండడము గాని గంజాయిని అమ్మడము నేరమని తెలిపి వారిని అరెస్టు చేసి సదరు ముద్దాయిల వద్ద నుండి సుమారు 2.5 K.G ల గంజాయిని, మారుతి షిఫ్ట్ డిజైర్ కారును (AP-40-BR 7759) మరియు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి వారి పైన క్రైమ్ నంబర్ 173/2025 U/s 20(b)(ii)(B) of NDPS Act మేరకు నంద్యాల 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేయడమైనది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







