Tuesday, February 3, 2026

ఘనంగా”కవిసింహ” కాశీపతి 134వ జయంతి ఉత్సవాలు….

నారద వర్తమాన సమాచారం

ఘనంగా”కవిసింహ” కాశీపతి 134వ జయంతి ఉత్సవాలు

కవిసింహ కాశీపత్యవధానిగారి 134వ జయంతి వేడుకలు నరసరావుపేట యస్.యస్.యన్.కళాశాలలో ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట శాసనసభ్యులు డా.చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.గార్లపాటి గురుబహ్మాచారి రచించిన "పోకూరి కాశీపత్యవధాని జీవితం-సాహిత్యం"అనుగ్రంధమును ఆవిష్కరించారు.అనంతరం నూతలపాటి రత్నశర్మ వ్రాసిన"సుభాషితాని"అనుగ్రంధమును ఆవిష్కరించారు. కవి పరిశోధకులు అలంకారం వెంకట రమణరాజు,మరియు విద్యాతపస్వి మామిళ్ళ వెంకట లోకనాధం లకు "కవిసింహ పోకూరి కాశీపత్యవధానలవారి"పురస్కారం ఇచ్చి సత్కరించారు. అలాగే గురజాల అప్పారావు మరియు బెజ్జంకి జనార్ధనాచార్యులు వారిని కూడా సత్కరించడం జరిగినది.అనంతరం కవి రచయిత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు ఉత్సవకమిటీ కార్యదర్శి ఆధ్వర్యంలో పద్యమౌళి రాధశ్రీ నిర్వహణలో కవిసమ్మేళనం 30మంది ప్రముఖ కవులతో నిర్వహించారు. యస్.యస్.యన్.కళాశాల పూర్వ ఉపన్యాసకులు సదరు సభకు సమన్వయకర్త కంచర్ల కామేశ్వరరావు కృషితో సభ దిగ్విజయంగా నిర్వహించబడినది.వీరవల్లి వరదయ్య,యం.యస్.సుధీర్ ,కొల్లోజు కనకాచారి ప్రభృతులు ఉపన్యశించారు.
చేరెడ్డి మస్తాన్ రెడ్డి, మేళ్ళచెరువు భానుప్రసాదు,రత్నాకరం రాము,ఈవూరి వెంకటరెడ్డి, నల్లూరి రామ్ ప్రసాదు,దుబ్బలదాసు,మంగళగిరి అనిల్ శాస్త్రి, గురజాల అప్పారావు మొదలకు ముప్పదిమంది కవులు స్వీయకవితాగానంతో సభ్యులను ఆనందపరిచారు.
కంచర్ల కామేశ్వర రావు వందనసమర్పణతో సభ ముగిసింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version